మీలో ఈ విషయముంటే అమ్మాయిలు మీకు ఫిదా అయిపోవడం ఖాయం…!
ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకు అంత సులభంగా ఫిదా అవ్వట్లేదు. పురుషులు స్త్రీలను ఎంతలా తమను ప్రేమగా దగ్గరికి తీసుకున్నా వారు మాత్రం ఇంకా ఏదో కావాలనే కోరుకుంటున్నారు. తమ మనసులో ఏమి కోరుకుంటున్నామో తెలుసుకునే పురుషులపై మహిళలు తెగ ప్రేమ చూపుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇక ఆ విషయానికొస్తే అమ్మాయిలు అబ్బాయిల ద్వారా ఆ సమయంలో సరైన స్పందన కోసం తెగ ఎదురుచూస్తుంటారు. తమ పార్ట్ నర్ తమను చూడగానే మత్తెక్కి పోవాలని, తమపై చాాలా ఇష్టంతో, ప్రేమతో, ముఖ్యంగా గాఢమైన కోరికలతో తమ దగ్గరకు రావాలని ఆశిస్తారు. అలాగే తామంటే పురుషులకు చాలా క్రేజ్ ఉండాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు. తమను అమితంగా ప్రేమించే అబ్బాయిలతో తాము గడపాలని ఎక్కువ మంది అమ్మాయిలు కలలు గంటున్నారు. అయితే అలాంటి అమ్మాయిలను ఆకట్టుకోవడానికి పురుషులు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు అమ్మాయిలు కచ్చితంగా మీకు ఫిదా అయిపోతారు… ఆమెను ఆశ్చర్యపరచాలి… మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నా లేదా ప్రేమలో ఉన్న సమయంలో స్త్రీలను ఆకట్టుకునేందుకు కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవాలి. అందులో మొదటిది అమ్మాయిలను సర్ ప్రైజ్ చేయడం. వీకెండ్ లో ఆమెతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లండి. లేదా ఏదైనా మంచి రెస్టారెంటుకు వెళ్లి డిన్నర్ ప్లాన్ చేయండి. లేదా ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వండి. ఇలా చిన్న ప్రయత్నంతో ఆమెను ఆకట్టుకునేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం మీరు మీ జేబును ఖాళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నంతలో రూపొందించిన ప్రణాళిక విజయవంతం కాకపోయినా మీ ప్రయత్నం ఆమెను బాగా ఆకట్టుకుంటుంది. దీని వల్ల అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అవుతారట.
*** తనంటే ఎంత ముఖ్యమో..
మీరు ప్రేమలో ఉన్న సమయంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి చేయాలి. అదేంటంటే తనంటే మీ జీవితంలో ఎంత ముఖ్యమో తెలిపే ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఎవ్వరితోనూ షేర్ చేసుకోలేని విషయాలను కూడా తనతో షేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు తనకు ఎంత ఎక్కు ప్రాధాన్యత ఇస్తున్నారో అమ్మాయికి తెలుస్తుంది. అందాన్ని పొగడాలి… అమ్మాయిలను అందంగా ఉన్నావని పొగిడితే చాలు, వారు చాలా సులభంగా మీ దారిలోకి వచ్చేస్తారు. అలాగే ప్రతి చిన్న విషయాన్ని గుర్తు చేస్తూ మీరు మెసెజ్ లేదా వాట్సాప్ లు చేసినా మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. ‘నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ.. నువ్వు ఏడిస్తే నేను చనిపోతా‘‘ లేదా ‘నిత్యం నీ గురించే ఆలోచిస్తున్నా ప్రియా‘ వంటి డైలాగులకు లేదా మెసేజ్ లకు అమ్మాయిలు ఫిదా అయిపోతారని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
*** మానసిక ఆనందం..
మహిళల సైకాలజీ ప్రకారం అమ్మాయిలలో చాలా మంది శారీరక ఆనందం కంటే మానసిక ఆనందాన్నే ఎక్కువగా కోరుకుంటారు. అందుకే తనను అర్థం చేసుకునే భాగస్వామి లేదా ప్రియుడు దొరికితే చాలని అనుకుంటారు. అంతేకాదు అలాంటి వారిని ఎప్పటికీ విడిచి ఉండలేరు.
*** రొమాన్స్ కూడా ముఖ్యమే..
చాలా మంది పురుషులు రొమాన్స్ పట్ల చాలా శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలు ఎక్కువగా రొమాన్స్ నే ఇష్టపడుతున్నారు. ఈ విషయం అంతా ఓ సర్వేలో వెల్లడి అయినట్లు వైద్య నిపుణులు చెప్పారు. అయితే సినిమాల్లో చూపించినట్టు రొమాన్స్ అంటే కేవలం ముద్దులే కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే నిజ జీవితంలో అసలైన రొమాన్స్ రుచి చూపించినవాళ్లకే అమ్మాయిలు అవలీలగా పడిపోతారట.
*** కేరింగ్ చూపడం..
చాలా మంది అమ్మాయిలు తమపై ప్రేమ మరియు కేరింగ్ చూపించడాన్ని కూడా రొమాన్స్ లాగానే భావిస్తారట. ఉదాహరణకు ట్రాఫిక్ లో సిగ్నల్ క్రాస్ చేసే సమయంలో వారి చేయి పట్టుకోవడం.. ఎంత మందిలో ఉన్నా అమ్మాయిలను ప్రేమను పిలవడం వంటివి చేస్తే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారట. ప్రాధాన్యత ఇవ్వడం.. అబ్బాయిలు ఎవరిని అయితే ప్రేమిస్తున్నారో వారితో పాటు వారి స్నేహితులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలట. ముఖ్యంగా వారి బర్త్ డేలు, ముఖ్యమైన తేదీలు మరచిపోకుండా ఉండాలట. ఇంకా అవసరమైతే వారి ఇంట్లో వారి పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు కూడా గుర్తుంచుకుని ఆ సమయంలో వారిని విష్ చేసే వారిని బాగా ఇష్టపడతారట.
*** చనువు ఇవ్వాలి…
అబ్బాయిలు అమ్మాయిలకు చాలా ఎక్కువగా చనువు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది గతంలో కొన్ని ప్రేమ కథలు ఉంటాయి. వాటిని వారు తమ కొత్త భాగస్వామికి చెప్పాలని ఎప్పటికీ అనుకోరు. అయితే అలాంటి విషయాలను తలచుకుని వారిలో వారే చాలా బాధపడిపోతుంటారు. అలా వారు బాధపడకుండా ఉండాలంటే అలాంటి విషయాలను కూడా చెప్పుకునేంత చనువు మీరు ఇవ్వాలి.