అమెరికాలోని మిచిగన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి తీవ్రంగా గాయపడింది. అయితే ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు ముస్కేగాన్ హాస్పటల్ డాక్టర్లు వెల్లడించారు. మిచిగన్‌లోని లాన్సింగ్లో 25 ఏళ్ల చరితా రెడ్డి నివాసం ఉంటోంది. కారు ప్రమాద ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న చరితారెడ్డి టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తున్నది. అయితే వెనుకనుంచి వచ్చిన క్రిస్లర్ కారు ఢీకొట్టడంతో చరితారెడ్డి కోమాలోకి వెళ్లిపోయింది. క్రిస్లర్ కారు నడుపుతున్న వ్యక్తి తాగినట్లు నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నారు.
లాన్సింగ్లో కారు ప్రమాదం. హైదరాబాద్ యువతి బ్రెయిన్‌డెడ్.

Related tags :