స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జనవరి తొలి వారంలో షురూ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మాస్ గీతం పెట్టనున్నారట. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ పాటలో స్టార్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా మెరువనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే రెజీనా తక్కువ సమయంలోనే మెగాస్టార్ చిరు తో కలిసి డ్యాన్స్ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసినట్టే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కూడా ఇందులో భాగం కానుంది. సోషియా ఫాంటసీగా దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తుంది.
చిరంజీవితో రెజీనా జోడీ

Related tags :