Kids

కాగితపు పాము చేద్దామా?

How to make paper snakes - Telugu kids fun holiday projects

కావలసినవి:
పెన్సిల్‌
దారం చుట్టే చెక్రీలు
కాగితం
థంబ్‌స్టిక్‌
కత్తెర
గుండుసూది
ముందుగా బొమ్మలో చూపించిన విధంగా గీతలు గీసి, ఒక చివర పాము ముఖం వేయండి. బొమ్మ గీయడం పూర్తి అయ్యాక గీత వెంబడి కత్తిరించండి. దాని మధ్యలో ఒక రంధ్రం చేయండి. ఇప్పుడు పామును దాని మీద వేలాడదీసేందుకు స్టాండ్‌ తయారు చేయండి. దారం చుట్టే చెక్క రీలులోకి, ఒకవైపు రబ్బరు ఉన్న పెన్సిల్‌ను దూర్చండి. గుండు సూదిని దానికి గుచ్చి థంబ్‌స్టిక్‌ దూర్చండి. పాముతో సహా దానిమీద ఉంచండి. ఇప్పుడు ఈ పరికరాన్ని నిప్పు గూడు మీద పెట్టండి. గాలి వేడెక్కి పైకి వెళ్లడం మొదలు పెడుతుంది. దాంతో పాటు కాగితం పాము గుండ్రంగా తిరగడం మొదలవుతుంది. చెక్రీలు, పెన్సిలుకు బదులుగా టేబుల్‌ ల్యాంప్‌ కుప్పెకు తీగతో పామును వేలాడదీయవచ్చు. మీరు లైటు వేయగానే పాము గుండ్రంగా తిరుగుతుంది. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే పాము బొమ్మ దీపంతో గానీ, హీటర్‌తో గానీ నేరుగా తాకకూడదు.