ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ పైకి ఎక్కి విక్షించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. రోజుకు 4వేలకు పైగా సందర్శకులు, సెలవు దినాల్లో 5వేలకు పైగా సందర్శకులు చార్మినార్‌ను చూడడానికి వస్తుంటారు. 2019లో ఇప్పటివరకు చార్మినార్‌ను భారతీయులు 12,24,515మంది దర్శించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 9300 మంది తిలకించారు. ఈ సంవత్సరం చార్మినార్ సందర్శనకుల నుంచి రూ.3,34,2,875 వచ్చినట్లు చార్మినార్ కన్జర్వేషన్ అసిస్టెంట్ గోపాల్‌రావు తెలిపారు. చార్మినార్ అద్భుతమైన కట్టడమని చార్మినార్ కన్జర్వేషన్ అసిస్టెంట్ గోపాల్‌రావు తెలిపారు. చార్మినార్ వద్ద తాను పనిచేయడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. మంగళవారం పదవీ విరమణ చేయనున్న గోపాల్‌రావు చార్మినార్‌తో ఉన్న తన అనుభూతిని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
12లక్షల మంది భారతీయులకు కనువిందు
Related tags :