Movies

శుభలేఖలు వచ్చేశాయంట

శుభలేఖలు వచ్చేశాయంట-Alia Ranbir Wedding Cards Are Here-Telugu Movie News

బాలీవుడ్ నటులు అలియాభట్, రణవీర్ కపూర్‌ల రిలేషన్‌షిప్ గురించి రోజుకొక వార్త వినిపిస్తుంటుంది. త్వరలో వీరి వివాహం జరగబోతున్నదంటూ సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ కార్డు కూడా ప్రత్యక్షమయ్యింది. తాజాగా రణవీర్ తండ్రి రిషీ కపూర్, తల్లి నీతూ కపూర్‌లు పోస్ట్ వెడ్డింగ్ పూజ నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే రిషి, నీతూలు తమ పాత బిల్డింగ్‌కు రీ‌కన్‌స్ట్రక్షన్ చేయించనున్నారు. ఈ భవనంలోనే తమ కుమారుని పోస్ట్ వెడ్డింగ్ పూజ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ బిల్డింగ్ పేరు కృష్ణరాజ్. 1980లో వీరు ఈ బిల్డింగ్ కొనుగోలు చేశారు. 35 ఏళ్లుగా వీరు ఇదే భవనంలో ఉంటున్నారు. ఈ బిల్డింగ్‌ను కూల్చివేసి, ఇదే ప్రాంతంలో మరో బిల్డింగ్ నిర్మించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం గ్రేటర్ ముంబై కార్పొరేషన్ నుంచి అనుమతి కూడా పొందారని తెలుస్తోంది. ఇదిలావుండగా ప్రస్తుతం అలియా, రణవీర్‌లు విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు.