* తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయాలతో పాటు గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని తెలుస్తోంది.
*షేక్‌పేట్‌లోని పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమయింది. ఇండియన్ ఆయిల్ బంకులో ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్‌లో దట్టమైన పొగ కమ్ముకుంది. కారులోని వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*జనగామ మండలం చౌడారం గ్రామంలో మారబోని నాగయ్య 60 సంవత్సరాల నుండి, సాగుచేస్తున్న భూమిని. చాగల్లు గ్రామ వ్యక్తులు. భూమి మాది అని కోర్టులో కేసు వేశారు. అది తట్టుకోలేక మనస్తాపానికి గురై, అందరు పడుకున్నాక పంట చేను వద్దకు వెళ్లి, ఉరి వేసుకుని ఆత్మహత్య…
*పదహారేళ్ళ యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా ఆమె అసభ్యకరమైన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంబాలిక ఇంటి పక్కన ఉండే ముగ్గురు యువకులు గత కొన్ని రోజులగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నారు.
*భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
*ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌లాల్ రాజ్‌పుత్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌పై దొంగతనం ఆరోపణలు మోపడమే గాక అతన్ని అనుచరులతో తీవ్రంగా కొట్టడంతో అతనితో పాటు మరో 35 మందిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
*ఓ కాలనీలో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారం దందాను పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగింది.
*మహబూబాబాద్ పట్టణంలో వెంటేశ్వర బజారులో, గల ప్రభుత్వ భూమిలో, గుడిసెలు వేసుకున్న భూమి లో, మరొకరు చేస్తున్న గృహ నిర్మాణం ను నిలిపివేయాలంటూ, గాంధీ పార్క్ లోని వాటర్ ట్యాంక్ ఎక్కిన నలుగురు మహిళలు.
* భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
* యూదుల పండుగ అయిన హనుక్కా వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఆ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని యూదు ప్రజా వ్యవహారాల మండలి ట్విట్టర్‌లో పేర్కొంది.
* ముగ్గురు చైనా శాస్త్రవేత్తలకు జైలు
ముగ్గురు చైనా వైద్య శాస్త్రవేత్తలకు ఆ దేశ కోర్టు జైలు శిక్ష విధించింది. హెచ్‌ఐవీ సోకని ముగ్గురు శిశువులను సృష్టించినట్లు హి జియాన్‌కుయి 2018 నవంబర్‌లో సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలిసారి చేపట్టిన జన్యు ఎడిటింగ్ ప్రక్రియతో వారు జన్మించినట్లు పేర్కొన్నారు. దీంతో చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మాజీ ప్రొఫెసర్ అయిన హి పరిశోధనలపై చైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని రెండు వైద్య సంస్థలకు చెందిన జాంగ్ రెన్‌లీ, క్విన్ జిన్‌జౌలకూ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. షెన్‌జెన్‌లోని నాన్షాన్ జిల్లా ప్రజాకోర్టు వీరిని దోషులుగా తేల్చింది. హికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు 4,30,000 అమెరికా డాలర్లు (సుమారు రూ.3 కోట్లు) జరిమానా , మరో ఇద్దరికి రెండేండ్ల జైలు, జరిమానా విధించింది.
* ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక విద్యార్థి మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు
*జన్యు ఎడిటింగ్ విధానంలో శిశువులను సృష్టించినట్లు ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపర్చిన ముగ్గురు చైనా పరిశోధకులకు జైలు శిక్ష పడింది. వారు అక్రమ వైద్య విధానాలకు పాల్పడ్డారని నిర్ధారించిన చైనా న్యాయస్థానమొకటి సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కారాగార శిక్షతోపాటు జరిమానాలూ విధించింది.
*ఉప్పల్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ఎదుట.. స్కూల్ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది.
*స్నేహితుడి పుట్టిన రోజున విందు చేసుకున్న యువకులు.. అర్ధరాత్రి కారులో ఇంటికి బయలుదేరారు.. మార్గమధ్యంలో కారు అదుపుతప్పి మరో రెండు కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులతోపాటు మరో యువకుడు తీవ్రగాయాల పాలయ్యారు
*హాల్వి నుంచి కోసిగికి కర్ణాటక మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తి ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. మండలంలోని ఆర్లబండ మలుపు వద్ద ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాసులు, కానిస్టేబుల్ తిక్కయ్య, తదితరులు తనిఖీలు నిర్వహిస్తున్నారు
*మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్సై యువరాజు వివరాల మేరకు.. మతిస్థిమితం లేని మహిళపై హనుమంతు అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలి తరఫున ఒకరు ఫిర్యాదు చేశారు. సోమవారం బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
*ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉద్యానవన శాఖ సంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న బిజయకేతన్ ఉపాధ్యాయ(2009 ఐఏఎస్ బ్యాచ్) లంచం తీసుకుంటూ నిఘా అధికారులకు చిక్కారు. ఒక ఫార్మ్‌హౌస్ అనుమతికి సంబంధించి బిజయకేతన్ సోమవారం తన కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. బిజయకేతన్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
*ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్ల గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
*పంట పొలాల్లోకి వచ్చే అడవి పందులను చంపేందుకు తాను తయారు చేసిన నాటు బాంబులే అతడి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఎక్స్‌రోడ్ వద్ద సోమవారం నాటు బాంబులు పేలి రాఠోడ్ మానిరావు (40) అక్కడిక్కడే మృతిచెందగా అతడి తమ్ముడు శనిరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
* ప్రమాదవశాత్తు రెండతస్తుల భవనం నుంచి జారిపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
*భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటున్న మహిళను ఓ వ్యక్తి వేధిస్తూ.. చివరికి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. చివరకు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన చంద్రమ్మ- హన్మప్పల కుమార్తె అంజిలమ్మ(37) కు 20 ఏళ్ల క్రితం తాండూరు మండలం చెనిగేస్పూర్కు చెందిన వెంకటయ్యతో వివాహమైంది. ఏడు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు
*కజఖ్స్థాన్లో 100 మందితో బయల్దేరిన ఒక విమానం అదుపు తప్పి, ఇంట్లోకి దూసుకెళ్లడంతో 12మంది బలయ్యారు. ఈ పెను ప్రమాదం నుంచి అనేక మంది సజీవంగా బయటపడ్డారు.
*ఈశాన్య నైజీరియాలో తమ చెరలో బందీలుగా ఉన్న 11 మంది క్రైస్తవులనూ చంపేసినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో జట్టుకట్టిన నైజీరియా జిహాదీలు ప్రకటించారు. ఐఎస్ ప్రచార విభాగమైన అమక్ ఈ మేరకు గురువారం ఆన్లైన్లో ఓ వీడియో విడుదలచేసింది.
*చాక్లెట్ ఆశచూపి తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘోరం నెల్లూరు జిల్లాలో జరిగింది. పొదలకూరు మండలానికి చెందిన యువకుడు(35) శుక్రవారం ఉదయం తన ఇంటి ముందున్న బాలికను చాక్లెట్ ఇస్తానని ఆశచూపి అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
*ఏడేళ్ల బాలికపై ‘హత్యా’చారం చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోయంబత్తూరులోని పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఏడాది మార్చి 31న తొండాముత్తూరు పరిధిలో ఓ ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో పోలీసులు పన్నిమడైకి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతనికి గతంలోనే వివాహమైంది
*విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. స్థానిక విజయశ్రీ ఆర్గానిక్స్ ఫార్మా సంస్థలో ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే స్మైలెక్స్ లేబొరేటరీస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది.
*పోలీసు అధికారినంటూ మోసాలకు పాల్పడటం.. ఫలానా కంపెనీలో ఉన్నతోద్యోగినని చెప్పి అమాయకుల నుంచి డబ్బులు కాజేయడం వంటి ఘటనలు మనం చూసే ఉంటాం. ఈ చిన్నా చితకా మోసాలు మనకెందుకులే అనుకున్నారో ఏమో గానీ.. ఏకంగా సీబీఐ డైరెక్టర్ ఆర్కే శుక్లా అవతారమెత్తేశారు ఇద్దరు మోసగాళ్లు.
*సూరత్లో గత ఏడాది ఓ మూడేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన కేసులో కింది కోర్టు విధించిన మరణశిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ బేల త్రివేది, జస్టిస్ ఏ.సి.రావులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
*రంగారెడ్డి జిల్లా పరిధి హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో మొహబత్నగర్ గేటు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
*రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మొహబత్నగర్ వద్ద ఓ వ్యాను బీభత్సం సృష్టించింది. వ్యాను అదుపుతప్పి బైక్, ఆటో, కారు మూడింటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
* జవహర్ నగర్ మైత్రీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న స్థిరాస్తి వ్యాపారి నర్సింగ్‌రావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. 50 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండితో పాటు నగదును దుండగులు అపహరించారు. బాధిత కుటుంబం నిన్న రాత్రి యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి వెళ్లింది. ఈ సమయంలోనే దొంగలు చోరీ చేశారు. నర్సింగరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చోరీ జరిగిన నివాసాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
* ఆస్ట్రేలియాలో కార్చిచ్చు దహించివేస్తున్నది. మంటలు వ్యాపిస్తున్న తీరు విక్టోరియా నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దావానలాన్ని తట్టుకోలేని ప్రజలు.. సముద్ర తీరం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆకాశం అంతా ఎర్రగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు.
రాయపాటి సంస్థలపై సీబీఐ దాడులు-నేరవార్తలు-12/31
Related tags :