అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుగా కీలక పాత్ర పోషిస్తున్న ఆయన కుమార్తె 38 ఏళ్ల ఇవాంక ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన తండ్రి తిరిగి ఎన్నికైతే తాను శ్వేత సౌధం నుంచి బయటపడతానన్న సంకేతాలు అందించారు. సిబిఎస్ ఇంటర్వూలో ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా బయటపెట్టారు. ట్రంప్ మళ్లీ ఎన్నికైతే పాలనాపరంగా కొనసాగుతారా అన్న ప్రశ్నకు పిల్లల సంతోషం తనకు మొదటి ప్రాధాన్యం అని ఆమె పేర్కొన్నారు. వారి అవసరాల ప్రాధాన్యం పైనే తన నిర్ణయాలు ఉంటాయని ఆమె చెప్పారు. వారి వల్లనే ఈ సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో అమెరికా అంతా పర్యటించానని, విస్మరించ బడిన అనేక వర్గాలకు సేవచేశానని ,దాదాపు ప్రతిరాష్ట్రం తాను పర్యటించానని అందర్నీ కలుసుకోడానికి అవన్నీ అవకాశాలు కల్పించాయని ఆమె చెప్పారు.
నాకొద్దు ఈ పదవులు
Related tags :