DailyDose

ఫిలిప్పీన్స్‌లో నందిగామ యువకుడి మృతి-తాజావార్తలు-12/31

Nandigama Guy Dies In Phillippines-Telugu Breaking News Roundup-12/31

*ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా నందిగామ నేతాజీనగర్‌కు చెందిన జగదీష్‌(22) మృతి చెందాడు. జగదీష్‌ 2016లో వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లాడు. సోమవారం అతడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జగదీష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం జగదీష్‌ వెటర్నరీ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం
* మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి.అసలే చలితో వణికిపోతున్న నగరవాసులను చిరుజల్లులు గిలిగా పలకరించి మరింత వణికించాయి. ఎప్పుడెప్పుడొస్తాడో అని సూర్యుని కోసం ఎదురు చూసే జనాలను… చలిగాలులతో కలిసి జల్లులు పులకరింపజేశాయి.
* జనవరి 1 తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన గ్రామ, వార్డు సచివలయాల సేవలను తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వంమౌలిక సదుపాయాల ను పూర్తి స్థాయి లో సిద్ధం కాకపోవడంతో సేవల ప్రారంభం నిలిపివేత
* భారత ఆర్మీ 28వ చీఫ్‌గా జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మూడేళ్ల పదవీకాలం నేటితో ముగియడంతో.. ఆయన నుంచి జనరల్ నరవానే బాధ్యతలు స్వీకరించారు.
* టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా విజ్డెన్‌‌‌‌ ప్రకటించిన ఈ దశాబ్దపు ఇంటర్నేషనల్‌‌‌‌ టీ20 టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ సంపాదించారు.అయితే, ఇండియాకు తొలి టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ అందించిన మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ మాత్రం ఈ టీమ్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ కాలేదు.
* హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు చలిగాలులతో ఉన్న నగరం మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులతో తడిసింది. ఇప్పటికే పెరిగిన చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఊహించని వర్షంతో ఇంకాస్త ఇబ్బందులకు గురవుతున్నారు.
* భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ పదవి విరమణ చేసిన ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు.
* సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్వర ప్రయాణం చేయటానికి వీలుగా విజయవాడ మీదుగా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైళ్లను నడపటానికి రైల్వేశాఖ రంగం సిద్ధం చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో కాకినాడ టౌన్‌ నుంచి విజయవాడ మీదుగా లింగంపల్లి వరకు మొత్తం 26 సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడవనున్నాయి. ట్రైన్‌ నెంబర్‌ 02775 పేరుతో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌ నుంచి బయలుదేరి లింగంపల్లికి ఉదయం 7.30కు చేరుతుంది. ఈ 26 సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జనవరి 1, 3, 6 , 8, 10, 13, 15, 20, 22, 24 , 27, 29 , 31 తేదీల్లో నడుస్తాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేకుండా పోయింది. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా.. ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తూ ఉండేవారు. తమ పార్టీలో క్రమశిక్షణ ఎక్కువని.. అలా ఎవరూ.. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పరని.. బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకునేవారు
* కేరళ శాసనసభలో సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. సిఎఎపై చర్చించడం కోసం కేరళ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది.
* భారత తొలి మహా దళాధిపతి (సీడీఎస్)గా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు అమెరికా అభినందనలు తెలిపింది. 61 ఏళ్ల జనరల్ రావత్‌ను సీడీఎస్‌గా నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్మీ చీఫ్‌గా ఇవాళ ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, వైమానిక దళం సహా భారత త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం సీడీఎస్‌ను నియమించనున్నట్టు ప్రధాని మోదీ ఈ ఏడాది స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
* పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించిన సీడబ్ల్యూసీ అధికారులు… సోమవారం పీపీఏ, రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.
* ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం విధించింది.
నౌకలు, నౌకా నిర్మాణ కేంద్రాల్లో తమ సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా సైట్లు, యాప్‌లు వాడరాదని పేర్కొంటూ ఆదేశాలను జారీ చేసింది.
* ఢిల్లీలో ప్రధాని నివాస సముదాయమైన 9 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ (ఎల్‌కేఎం)లో సోమవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
* ఎప్పుడైనా చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్ ప్రారంభమైంది
* సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ కుమార్ సిన్హాను మరో ఏడాదిపాటు ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) డైరెక్టర్గా కొనసాగిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను ఆధార్తో అనుసంధాన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.
* భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుండి రావత్ సీడీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
* మదనపురం మండలం ఆసియా ఖండంలో నే రెండవదిగా ప్రసిద్ధి చెందిన, ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళ సాగర్ ప్రాజెక్టు కుశంకరంపేట సమీపంలో పెద్ద గండి పడింది.గమనించిన రైతులు అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించడం లేదని రైతులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా సరళాసాగర్ ప్రాజెక్టు కు గండి పడి నీరంతా బయటకు వెళ్ళతుండటంతో ఆత్మకూరు వనపర్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలుగు వేల ఎకరాల లో వరి నాట్లు చేసుకునేందుకు రైతులు నార్లు పో సుకున్నారు.వారి కార్యాచరణ ప్రశ్నర్థక మయ్యింది…
* మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఏపీ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి గా 2019 అక్టోబర్ 7న ప్రమాణస్వీకారం చేశారు
* విజయవాడలో ప్రస్తుతం గవర్నర్ నివసిస్తున్న రాజ్ భవన్ అంతకు ముందు సీఎం క్యాంప్ కార్యాలయంగా సేవలు అందించిన భవనంలో 2019 జనవరి 2న హైకోర్టు మొదటి రోజు విధులు ప్రారంభమయ్యాయి.
* 2019 జనవరి 1న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ హైకోర్టుకు కేటాయించిన 13 మంది న్యాయమూర్తులతో అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
* ఉమ్మడి హైకోర్టు విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్కు హైకోర్టు ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తవుతుంది. 13 మంది జడ్జిలతో 2018 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ భూభాగంలో హైకోర్టు సేవలు అందించడం ప్రారంభించింది
* దేశ రాజధాని దిల్లీ సహా జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేస్తున్న కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి
* జమ్ముకశ్మీర్లో సోమవారం రాత్రి రెండు గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూప్రకంపనలు ఏర్పడ్డాయి. రిక్టర్ స్కేల్పై 4.7-5.5 మధ్య తీవ్రత నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు.
* రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు నేడు అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
* మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ రైతులను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకోనున్న సందర్భంగా సిద్ధం చేసిన వేదిక.
*కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు సకలశుభాలను పంచుతుందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం 11 నుంచి 12:30 వరకు రాజ్‌భవన్‌లో సాధారణ ప్రజలను గవర్నర్‌ కలవనున్నట్లు ఆయన కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. పుష్పగుచ్ఛాలు కాకుండా కేవలం మొక్కలతో వచ్చి శుభాకాంక్షలు తెలపవచ్చని సూచించారు. 2020కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజ్‌భవన్‌ క్యాలెండర్‌ను సోమవారం గవర్నర్‌ ఆవిష్కరించారు.
*ఉద్యోగ నియామక రాత పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష కేంద్రాలకు వాటి బట్వాడా, ప్రతిభావంతుల (ర్యాంకింగ్‌) జాబితా తయారీ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఓ ప్రసిద్ధ సంస్థకు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల నిర్వహణలో పేరొందిన సంస్థతో ప్రాథమికంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కమిషన్‌ కార్యదర్శి పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు వెల్లడించారు.
*నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌ (కేపీసీఎల్‌) పరిధిని 25 కి.మీ.కి తగ్గిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటిదాకా 30 కి.మీ. వరకు కేపీసీఎల్‌ పరిధి ఉంది. ఇందులో కొత్తపోర్టు ఏర్పాటు విషయంలో కన్‌సెషనరీ సంస్థకు అధికారాన్ని అప్పగిస్తూ 2008లో వచ్చిన ఉత్తర్వులు రద్దయ్యాయి. ఫలితంగా రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగింది.
*విశాఖ శారదాపీఠానికి శ్రీశైలంలో ఉన్న అర ఎకరా స్థలం లీజును 33 ఏళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. 2015 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు ఈ స్థలం లీజు గడువు ఉంది. తర్వాత గడువు పొడిగించాలని అభ్యర్థించిన నేపథ్యంలో.. లీజును వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2053 మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. చదరపు గజానికి రూ.7.50 చొప్పున వార్షిక అద్దె, అయిదేళ్లకోసారి 25% అద్దె పెంచేలా రెవెన్యూ (దేవాదాయ) కార్యదర్శి ఆదేశాలిచ్చారు.
*రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్‌ 2019 సర్టిఫికెట్ల పరిశీలన జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీ సెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌ కేంద్రాలకు నిర్ధారిత తేదీల్లో హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగులందరూ 8వ తేదీ ఉదయం పదింటికి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు.
*కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ విద్యుత్తు ప్లాంటు(ఆర్‌టీపీపీ)ను జాతీయ థర్మల్‌ విద్యుత్తు సంస్థ(ఎన్‌టీపీసీ)కి విక్రయించే ప్రయత్నాలు నిలిపేయాలని విద్యుత్తు సంఘాల ఐక్య కార్యచరణ సమితి(ఐకాస) కోరింది. ఈ అంశంపై ఐకాస నేతలు సోమవారం.. ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌, జెన్‌కో ఎండీ శ్రీధర్‌లను కలిసి చర్చించారు. అనంతరం ఐకాస నాయకుడు వేదవ్యాస్‌ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో త్వరలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎండీ హామీ ఇచ్చారని చెప్పారు.
*దివ్యాంగుడిగా సమస్యలనూ, అప్పులు పెరిగిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ లేఖరాసి పేరుసోముల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు
*సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర భద్రతా కమిషన్‌, పోలీసు ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల హోంశాఖ కార్యదర్శులు రవిగుప్తా, కిశోర్‌కుమార్‌లు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
*పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో గోడలు, అల్మారాలు, కిటికీలు, లిఫ్టు, ప్రహరీ గోడలు ఇతర చోట్ల ఇకపై ఉపాధ్యాయ సంఘాలు గోడ పత్రికలు, క్యాలెండర్లను అంటించడం నిషేధం. దీన్ని ఉల్లంఘిస్తే ఆయా సంఘాలకు రూ.10 వేల జరిమానా విధిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే ఒక్కో పోస్టర్‌కు రూ.10 వేల మొత్తాన్ని జరిమానాగా వసూలు చేసి, విద్యానిధిలో జమ చేస్తామన్నారు
*పురపాలక ఎన్నికల రిజర్వేషన్లను జనవరి ఐదున ప్రకటించనున్నట్లు పురపాలకశాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన, బీసీలకు ఓటర్ల జాబితా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. రిజర్వేషన్లు గరిష్ఠంగా 50 శాతం మించవని స్పష్టం చేశారు.
*రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ డిసెంబర్ 29 నుంచి జనవరి ఒకటి వరకు తుర్కయంజాల్లోని కే.బీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు.
*రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ డిసెంబర్ 29 నుంచి జనవరి ఒకటి వరకు తుర్కయంజాల్లోని కే.బీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు.
*గోదావరి పరవళ్లతో రాజరాజేశ్వర జలాశయం కళకళలాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతన్నల స్వప్నం సాకారం కాబోతోంది. రెండేళ్ల కిందట రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయం నిర్మాణం పూర్తికాగా, తాజాగా శుక్రవారం సాయంత్రానికి 25.873 టీఎంసీల పూర్తి నిల్వ సామర్ధ్యానికి నీరు చేరుకుంది. 2017 సెప్టెంబరులో మొదటిసారి జలాశయంలోకి 5 టీఎంసీల నీటిని నింపి సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
*సికింద్రాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన తేనీటి విందు శుక్రవారం ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళిసై, సౌందరరాజన్ దంపతులు, ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, ఆర్.సుభాష్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్లు దీనికి హాజరయ్యారు.
*కొత్త విషయాలేవీ లేకుండా దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రాన్ని అనుమతించడమంటే గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడమేనని, అలా తన ఉత్తర్వులను పునఃసమీక్షించుకునే అధికారం ఈ కోర్టుకు లేదంటూ… పెన్నా సిమెంట్స్ శుక్రవారం సీబీఐ కోర్టుకు నివేదించింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా సిమెంట్స్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రాన్ని విచారణకు పరిగణనలోకి తీసుకోరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై శుక్రవారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.వి.మధుసూదన్రావు విచారణ చేపట్టారు.
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బృంద బీమా(గ్రూపు ఇన్సూరెన్స్) పథకం కింద వడ్డీరేటును 7.9 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ వడ్డీరేటు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
*సాగర్ నుంచి శ్రీశైలానికి ఈ నెల 31న ప్రత్యేక లాంచీ ప్రయాణం నిర్వహిస్తున్నట్లు హిల్కాలనీ యూనిట్ మేనేజర్ హరి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం హిల్కాలనీ నుంచి ఈ ప్రత్యేక ప్రయాణాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లాంచీ తిరిగి బుధవారం సాగర్కు చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని.. టికెట్ బుకింగ్ చేయాలనుకొనే పర్యాటకులు 70360 65065, 94938 69504 నంబర్లను సంప్రదించాలని కోరారు.
*పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం(2020-21) మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అనువుగా పాలిసెట్-2020ను వచ్చే ఏడాది ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆధ్వర్యంలో కమిటీ పరీక్ష తేదీని ఖరారు చేసింది. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు 30 శాతం మార్కులు వస్తేనే కౌన్సెలింగ్కు అర్హత పొందుతారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కు ఒకటిగా నిర్ణయించారు.
*పదో తరగతి ధ్రువపత్రాలను నకిలీవి తయారు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం భద్రతా ప్రమాణాలను పెంచాలని యోచిస్తోంది. అంతేకాక అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనప్పుడు వారు సమర్పించే ధ్రువపత్రాలు అసలువా?నకిలీవా? అనేది తెలుసుకోవడానికి ఆయా కంపెనీలు వాటిని ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపిస్తున్నాయి. అందుకు ఒక ప్రత్యేక విభాగమే పనిచేస్తోంది.
*తెలంగాణలో శాఖాపరమైన పదోన్నతి కమిటీలను పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాధిపతుల కార్యాలయాల్లోని అదనపు, సంయుక్త కార్యదర్శులు, మూడో స్థాయి గెజిటెడ్ అధికారులతో పాటు వివిధ కేడర్ల పోస్టులకు సంబంధించిన కమిటీలు ఇందులో ఉన్నాయి. గతంలో ఈ కమిటీలకు నిర్దేశించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చింది.
*రాజధాని పరిధిలోని కోకాపేటలో చేపట్టిన యాదవ, కురుమ సంక్షేమ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తమ కార్యాలయంలో ఆయన ఈ భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
*బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నందున ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ 19 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.
*శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన సంవత్సరానికిగానూ తీపి కానుక అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది. అయితే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇంతకుముందు కేవలం కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా ఇక నుంచి అందరికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 20 వేల లడ్డూలను అందిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఉచిత లడ్డుతో కలిపి రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనుంది. ఇక అదనంగా లడ్డులు కోరే భక్తులకు ప్రస్తుతం ఉన్న ధరకే లడ్డూలు ఇస్తామని టీటీడీ వెల్లడించింది.