1. పుష్య మాసం ఆరంభమైంది – దాని విశేషాలు- ఆద్యాత్మిక వార్తలు- 12/31
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు నొసగుతాడని పురాణ ప్రవచనం. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్ర్తియ కోణం ఏంటంటే ఈ రెండూ ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
**శని ధర్మ దర్శి
న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి. పుష్యమాసం తొలి అర్ధ్భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది. ఇక, శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్యమాలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జురుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.ఆరోజు నుండీ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుందని, సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధనరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి, పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. తెలకపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
2.4న తిరుపతిలో తిరుప్పావై పాశురాల పోటీలు
తితిదే ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 4న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు తిరుప్పావై పాశురాల పోటీలు నిర్వహించనున్నారు. మొదటి శ్రేణిలో 1 నుంచి 5వ తరగతి వరకు, ద్వితీయ శ్రేణిలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొనవచ్చు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేస్తారు. వివరాలకు 0877 2277777 నంబరును సంప్రదించాలని తితిదే అధికారులు తెలిపారు.
3.బద్రీనాథుని ఆలయంపై మంచు దుప్పటి
ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హిమపాతానికి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం సగం వరకు మంచుతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో సైతం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కుఫ్రీ, మనాలి, సోలాన్, భుంటర్, సుందర్నగర్, కల్పా తదితర ప్రాంతాల్లో శుక్రవారం సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.కీలాంగ్లో అయితే రికార్డు స్థాయిలో మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని హిమాచల్ప్రదేశ్ వాతావరణ శాఖ అధికారి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలోని మధ్య, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు హిమపాతంతో పాటు వర్షం కూడా పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. గత 24 గంటల్లో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉందని వెల్లడించారు.
4. అయోధ్యలో ఫిబ్రవరి 25వరకు నిషేధాజ్ఞలు…
రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో ఫిబ్రవరి 25వ తేదీ వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. అయోధ్య నగరంలో ఫిబ్రవరి 25వతేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయోధ్యలో నలుగురి కంటే ఎక్కువ మంది సమావేశం అవరాదని అనూజ్ కుమార్ కోరారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసన ఉద్యమాలతో అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ ముందుజాగ్రత్త చర్యగా ఈ నిషేధాజ్ఞలు విధించారు.
5. టీటీడీ ఈవో అధికారాల్లో కోత!
తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధికారాలకు కళ్లెంవేసే దిశగా ప్రస్తుత పాలకమండలి పావులు కదుపుతోంది. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. సమావేశంలో ప్రధానంగా తిరుపతిలోని టీటీడీ భూముల లీజు విషయంపైనే చర్చ జరగనున్నట్లు సమాచారం. అలిపిరి సమీపంలో దేవలోక్ ప్రాజెక్టు, టాటా కేన్సర్ ఇన్స్టిట్యూట్, అరవింద్ ఆస్పత్రిలకు టీటీడీ భూములను లీజుకు కేటాయించిన విషయం తెలిసిందే.ఆ భూముల్లో టీటీడీ ఆశించిన ఏర్పాట్లు జరగలేదని పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో భూముల లీజు విషయమై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా.. నిత్యావసర సరుకులు, వస్తువులు, పరికరాలు, యంత్రాలు, వైద్య సదుపాయాల కొనుగోళ్లు, మరమ్మతులు, ఆధునీకరణ, నిర్మాణాలు, కాంట్రాక్టు పనులు తదితరాల నిర్వహణ కొరకు రూ.2 కోట్లకు లోబడి బడ్జెట్ ఉంటే టీటీడీ ఈవో అనుమతితో ఫైలు కదిలేది. ఆ తరువాత రాటిఫికేషన్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకునేవారు.ఈవోకు ఈ విచక్షణాధికారం ఎంతోకాలంగా వస్తోంది. అయితే శనివారం ధర్మకర్తల మండలి సమావేశం నేపథ్యంలో బుధవారం వర్క్స్ కమిటీ సమావేశమై రూ.2 కోట్లకు లోబడి ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న కాంట్రాక్టు పనులు, కొనుగోళ్ల వ్యవహారాలను పరిశీలించింది. టెండర్లు, కొనుగోళ్లు ఈవో ద్వారానే జరుగుతున్నాయని గుర్తించి ధర్మకర్తల మండలి ప్రాధాన్యాన్ని పెంచుతూ ఇకపై రూ.25 లక్షలు పైబడిన ప్రతి లావాదేవీని బోర్డుకు సమర్పించాలని వర్క్స్ కమిటీ నిర్ణయించింది.దీనిని అజెండాలో చేర్చి శనివారం జరిగే సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే అత్యవసర పరిస్థితుల్లో సరకులు కొనుగోళ్లు, నిర్మాణాలు, మరమ్మతులు వంటి వాటికి ఆటంకం కలిగే ప్రమాదముంది. బోర్డు ప్రతి నెల సమావేశమై అవసరమైన అంశాలకు ఆమోదం తెలిపినా కార్యాచరణకు కొంత కాలం పడుతుంది. దీంతో పాలనపరంగా సమస్యలు తలెత్తే అవకాశముందని కొందరు టీటీడీ సీనియర్ అధికారులు భావిస్తున్నారు.
6. ఆంగ్ల నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అన్నిరకాల ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలతోపాటు, దాతలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు కల్పించే ప్రత్యేక దర్శనం కోటా రద్దు చేసినట్లు తెలిపారు. టైం స్లాట్, దివ్య దర్శనం, అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ ఉండదన్నారు.వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతోపాటు ప్రివిలేజ్డ్, ప్రత్యేక ప్రవేశం, టైంస్లాట్, దివ్యదర్శనం, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ ఉండదని స్పష్టం చేశారు. జనవరి 6న తెల్లవారుజామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.
7. చరిత్రలో ఈ రోజు సెంబర్, 31
సంఘటనలు
2010: ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.
జననాలు
1870: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (మ.2017)
1907: కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)
1918: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, ప్రముఖ సాహితీవేత్త.
1928: కొంగర జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004)
1937: ఆంథోనీ హాప్కిన్స్, నటుడు.
1947: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. (మ.2009)
1953: ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.
1964: విన్‌స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1965: లక్ష్మణ్ శివరామకృష్ణన్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1977: సుచేతా కడేత్కర్, సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.
1979: మలింగ బండార, శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు.
మరణాలు
1900: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)
1965: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి.(జ.193)
2004: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
పండుగలు మరియు జాతీయ దినాలు
ఈరోజు ప్రపంచ తాగుబోతుల దినోత్సవంగా జరుపుకుంటారు.ఎందుకంటే ఈ డిసేంబర్ నెల సంవత్సరంలోనే లాస్ట్ నెల. పైగా లాస్ట్ రోజు. 31వ రోజుతో సంవత్సరం ఐపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అన్న ఆనందంలో మద్యం తాగడం అలవాటు ఉన్నవాల్లందరు ఫుల్ గా తాగుతారు. తాగడం అలవాటు లేని వాల్లు ఈరోజు కొత్తగా నేర్చుకుంటారు. కేవలం ఈ ఒక్క రోజే సంవత్సరం మొత్తం మీద ఎంత మద్యం అమ్ముతారో… అంత మద్యం అమ్ముతారు. ప్రతీ గవర్నమెంట్ కి ఈరోజే ఫుల్ ఆదాయం వస్తుంది. 31నైట్ 12కి ప్రతీ ఒక్కరి ఇంట్లో కేకులు కట్ చేస్కుంటారు. అదేరోజు రాత్రి నుండి అందరు చాలా బీజీగా షాపింగ్స్ చేస్థూ కొత్త బట్టలు, కేక్స్, కూల్ డ్రింక్స్, బిర్యాని, స్వీట్స్ కొంటారు. డిసేంబర్ 31 రాత్రి నుండి తెల్లరి జనవరి 1వ రోజంతా అందరూ కలిసిన వాల్లకి షేక్ హాడ్ ఇస్థూ… హగ్ చేస్కుంటూ కలవలేని వాల్లకి సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ట్విటర్, యస్సమ్మెస్ లతో హ్యాపీ న్యూయర్ అని విస్సెస్ చెప్పుకుంటారు.
8. పంచాంగము 31.12.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: శుక్ల
తిథి: పంచమి ప.02:54 వరకు
తదుపరి షష్టి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: శతభిషం రా.12:43 వరకు
తదుపరి పూర్వాభద్ర
యోగం: సిధ్ధి, వ్యతీపాత
కరణం: బాలవ
వర్జ్యం: ఉ.పూ.06:28 – 08:12
దుర్ముహూర్తం: 08:58 – 09:43
రాహు కాలం: ప.03:05 – 04:28
గుళిక కాలం: ప.12:18 – 01:42
యమ గండం: ఉ.09:32 – 10:55
అభిజిత్ : 11:56 – 12:40
సూర్యోదయం: 06:45
సూర్యాస్తమయం: 05:52
వైదిక సూర్యోదయం: 06:49
వైదిక సూర్యాస్తమయం: 05:48
చంద్రోదయం: ఉ10:36
చంద్రాస్తమయం: రా.10:25
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: పశ్చిమం
మధుదన పూజ
షణ్ముఖ షష్టి
9. రాశిఫలం – 31/12/2019
తిథి:
శుద్ధ పంచమి మ.2.23 , కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం:
శతాభిషం రా.12.23
వర్జ్యం:
శేషవర్జ్యం: ఉ.7.42 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు తిరిగి రా.10.48నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుటాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో అప్రమత్తంగా ఉండాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు.
10. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,
31.12.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 18C°-23℃°
• నిన్న 72,128 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 14 గదుల్లో భక్తులు
సర్వదర్శనం కోసం వేచి
ఉన్నారు,
• ఈ రొజు కోవిల్ ఆళ్వార్
తిరుమంజనం, మ: 12
తరువాతనే భక్తులను
స్వమివారి దర్శనానికి
అనుమతిస్తారు,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.35 కోట్లు,
• నిన్న 21,978 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న 17,275 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
/ / గమనిక / /
• ఆంగ్ల సంవత్సరాది
సందర్భంగా డిసెంబరు
30 నుండి జనవరి 1వ
తేదీ వరకు, వైకుంఠ
ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 4
నుండి 7వ తేదీ వరకు
దాతలకు ప్రత్యేక
దర్శనాలు, గదుల
కేటాయింపును
నిలిపివేయడమైనది.
• భక్తుల రద్దీ నేపథ్యంలో
నూతన ఆంగ్ల
సంవత్సరాది సందర్భంగా
డిసెంబరు 31, జనవరి
1వ తేదీల్లో, వైకుంఠ
ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 5
నుండి 7వ తేదీ వరకు
వృద్ధులు, దివ్యాంగులు,
చంటిపిల్లల తల్లిదండ్రుల
ప్రత్యేక దర్శనాలు రద్దు
చేయడమైనది.
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తారు. ఉ: 7గంటల
కి నమొదు చేరుకోవాలి,
ఉ: 10 మ: 2 గంటలకి
దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు/
ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం ప్రవేశం ద్వారా
స్వామి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.ttd Toll free #18004254141
11. నేడు, రేపు శ్రీవారి ఆర్జిత సేవల రద్దు
ఆంగ్ల నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అన్నిరకాల ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అన్ని ఆర్జితసేవలతోపాటు, దాతలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు కల్పించే ప్రత్యేక దర్శనం కోటా రద్దు చేసినట్లు తెలిపారు. టైం స్లాట్, దివ్యదర్శనం, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ కూడా ఉండదన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతోపాటు ప్రివిలేజ్డ్, ప్రత్యేక ప్రవేశం, టైంస్లాట్, దివ్యదర్శనం, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ కూడా ఉండదని స్పష్టం చేశారు. జనవరి 6న తెల్లవారుజామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.
12. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. జనవరి 6వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆలయ శుద్ది కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం మూలవిరాట్టును పట్టు పరదలతో పూర్తిగా కప్పేసి..ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజ పాత్రలను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రపరుస్తారు.