* రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త మోడళ్లను తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి షెర్పా, హంటర్ అనే పేర్ల ట్రేడ్‌మార్క్‌ను రిజిస్టర్ చేసుకొంది. దీంతో తన ప్రొడక్షన్ లైనప్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ విస్తరించనుందని భావిస్తున్నారు. ఇవి ఎంట్రి లెవల్‌గా ఉండే అవకాశం ఉంది. వీటికి ఈ సరికొత్త పేర్లను వాడే అవకాశం ఉంది. సాధారణంగా మోటార్ సైకల్ తయారీ కంపెనీలు ముందుగానే తమ ఉత్పత్తుల పేర్లను రిజిస్టర్ చేయిస్తాయి.
* రూపే కార్డు, యూపీఐ యాప్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రూ.50 కోట్లు ఆపై వార్షిక టర్నోవర్ ఉన్న అన్ని కంపెనీలు వినియోగదారులకు రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ ద్వారా చెల్లింపు విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 1, 2020కల్లా ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని.. లేని పక్షంలో ఆయా కంపెనీలకు రోజుకు రూ.ఐదు వేల జరిమానా విధించనున్నామని వెల్లడించింది.
* ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లలో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ ఎస్‌బీ) వ స్థానంలో నిలిచింది. ద ఫైనాన్షియల్ టైమ్స్ద ఎకనమిస్ట్బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ఫోర్బ్స్ ఇచ్చిన ర్యాంకింగ్‌ల వెయిటెడ్ యావరేజ్ ఆధారంగా పోయిట్స్ అండ్ క్వాంట్స్ ఈ ర్యాంక్ ఇచ్చిందని ఐఎ్‌సబీ వెల్లడించింది.
* శాశ్వత ఖాతా నెంబరు (పాన్)తో ఆధార్ తప్పనిసరి అనుసంధానానికి మరో మూడు నెలలు గడువు లభించింది. ఇం దుకు గతంలో నిర్దేశించిన గడువు డిసెంబరు తో (మంగళవారం) ముగియాల్సింది. అయితే మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తాజాగా వెల్లడించింది. ఈ రెండిం టి అనుసంధానానికి గడువు పొడిగించడం ఇది ఎనిమిదోసారి.
రూపే కార్డు, యూపీఐ యాప్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎండీఆర్‌ను ఎత్తివేస్తున్నట్లు శనివారం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. డిజిటల్ మార్గంలో వినియోగదార్ల నుంచి చెల్లింపులను స్వీకరించినందుకు బ్యాంకుకు వ్యాపారి చెల్లించే రుసుమునే ఎండీఆర్‌గా వ్యవహరిస్తారు. తాజా నిర్ణయంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించనుంది.
*భారత్ విదేశీ మారక నిల్వలు సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరాయి. డిసెంబరు 20తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 45.6 కోట్ల డాలర్లు పెరిగి 45,494.8 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
*పాన్ (శాశ్వత గుర్తింపు సంఖ్య)తో ఆధార్ అనుసంధానానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. పాన్తో ఆధార్ లింక్కు ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ దఫా డిసెంబరు 31 తర్వాత గడువు పొడిగించేదిలేదని స్పష్టం చేసింది. ఆధార్తో అనుసంధానం చేసుకోలేని పక్షంలో పాన్ పనిచేయదని పేర్కొంది. ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను చట్టంలో ఈ మేరకు సవరణను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రెండింటి అనుసంధానం కోసం ఆదాయ పన్ను వెబ్సైట్లో ఆధార్, పాన్ అనుసంధానం లింక్పై క్లిక్ చేసి, ఆ రెండింటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
*భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2,610.74 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. శుక్రవారంనాడిక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు
*ఇళ్ల ధరల వృద్ధి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 56 దేశాల్లో భారత్ 47వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో మన దేశంలో ఇళ్ల ధరలు గత ఏడాది ఇదేకాలంతో పోల్చితే కేవలం 0.6 శాతం పెరిగాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
*అదానీ గ్రూప్.. కోల్డ్ చెయిన్ లాజిస్టిక్స్ విభాగంలోకి అడుగుపెట్టిం ది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్.. లాజిస్టిక్స్లో మెజారిటీ వాటాను చేజిక్కించుకోవటం ద్వారా ఈ విభాగంలోకి ప్రవేశించింది.
*ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ సెజ్లో పానసోనిక్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు రూ.294.60 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ను నెలకొల్పనుంది. ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, వైర్లు తదితర ఉత్పత్తులను పానసోనిక్ ఇక్కడ ఉత్పత్తి చేయనుంది.
కొత్త బుల్లెట్లు వచ్చేశాయి-వాణిజ్యం-12/31
Related tags :