DailyDose

ఛీ..ఇదేం రాజకీయం ఎమ్మెల్యే రాజీనామా-రాజకీయ-12/31

SP MLA Resigns-Telugu Political News Roundup-12/31

*మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్త్తరణ జరిగిన మరుసటిరోజే ఎన్సీపీకి ఊహించని షాక్ తగిలింది. తానూ రాజకీయాలకు పనికిరనాంటూ ఆపార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే రాజీనామా చేసారు. బీద్ జిల్లా మజగల్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకే.. సోమవారం రాత్రి అనోపోహ్యంగా ఈమేరకు ప్రకటన చేసారు తనకు మంరి పదవి రాకపోవడం వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్నా ప్రచారాన్ని ఆయన ఖండించారు. సోమవారం రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్నా ప్రచారాన్ని ఆయన ఖండించారు.
*కేరళ అసెంబ్లీ చారిత్రాత్మక తీర్మానం
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ ఇవాళ కేర‌ళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. కేర‌ళ‌లో ఎటువంటి నిర్బంధ కేంద్రాలు ఉండ‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సెక్యుల‌ర్ రాష్ట్రామ‌న్న గుర్తింపుకు కేర‌ళ‌కు ఉంద‌న్నారు. గ్రీకులు, రోమ‌న్లు, అర‌బ్బులు.. ప్ర‌తిఒక్క‌రు ఈ నేల‌ను చేరుకున్నార‌న్నారు. క్రైస్త‌వులు, ముస్లింలు ముందుగా కేర‌ళ వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అంద‌ర్నీ క‌లుపుకుని పోవ‌డ‌మే కేర‌ళ సాంప్ర‌దాయ‌మ‌ని, ఆ సాంప్‌‌దాయాన్ని నిలుపుకోవాల‌ని సీఎం తెలిపారు. సీఏఏకు వ్య‌తిరేకంగా ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి ఎమ్మెల్యే జేమ్స్ మాథ్యూ మ‌ద్ద‌తు ప‌లికారు. ఎన్ఆర్‌సీ, సీఏఏ.. ఒకే నాణానికి రెండు వైపులు అని కాంగ్రెస్ నేత స‌తీష‌న్ ఆరోపించారు
* త్వరలోనే సరళాసాగర్‌ పునర్నిర్మాణం: మంత్రి నిరంజన్‌ రెడ్డి
మదనాపురం మండలం శంకరమ్మపేట వద్ద సరళాసాగర్‌ జలాశయానికి గండి పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరళా సాగర్‌ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి పరిశీలించారు. జలాశయం కట్ట తెగిన ప్రాంతాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి, దేవరకద్ర టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించి అధికారులతో సమీక్షించారు. సరళాసాగర్‌కు గండి పడిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని మంత్రి తెలిపారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడుతామన్నారు. రైతులకు రెండో పంటకు ప్రత్యామ్నాయం చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. యాసంగి పంటకు రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని నిరంజన్‌ రెడ్డి హామీనిచ్చారు. 30 ఏళ్ల కాలంలో రెండు, మూడుసార్లు మాత్రమే ప్రాజెక్టు నిండిందని మంత్రి తెలిపారు. కట్ట పునరుద్ధరణకు రెండు, మూడు రోజుల్లో పనులు మొదలు పెడుతామని చెప్పారు. గండికి కారణం ఏంటనేది సాంకేతిక బృందం పరిశీలిస్తుంది అని మంత్రి స్పష్టం చేశారు.
* పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు
పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించారు. అయితే రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు
* రైతులకు మద్దతుగా దేవినేని ఉమా దీక్ష
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. దీక్షకు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.రాజధానిలో ఉద్యమం అణిచివేతకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాజధానిపై కమిటీకి ప్రాధన్యత లేదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు రాజధానులు లేవని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాజధాని ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.
* రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు
తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయాలతో పాటు గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని తెలుస్తోంది.
* రైతుల దీక్షకు జనసేనాని మద్దతు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు 14వ రోజు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళనలకు మద్దతుగా జసనేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం అమరావతిలో పర్యటించారు. తొలుత మంగళగిరి మండలం నవులూరులో రైతుల దీక్షకు పవన్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులకు అభివాదం చేస్తూ ఎర్రబాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ సమస్యలను పవన్‌కు వివరించారు. సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పవన్‌ పర్యటనలో పాల్గొన్నారు.
*ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం:బొత్స
అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని, గత పాలకులకు దోచుకోవడమే తప్ప మరో లక్ష్యం లేదని విమర్శించారు. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవాచేశారు.
*మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 26 మంది కేబినెట్‌ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులను తీసుకున్నారు. శాసనసభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ వీరి చేత ప్రమాణం చేయించారు.
*వంశీ బాటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే?
తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు… గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటనే పట్టనున్నారా? సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత మద్దాలి చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. ‘‘ఏ పార్టీలోనో చేరాలని కాదు, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే సీఎంను కలిసేందుకు వచ్చా. వాళ్లు, పార్టీ (తెదేపాను ఉద్దేశించి) అంగీకరించకపోతే నేను కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగే అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడుగా గుర్తించమని స్పీకర్‌ను అడుగుతా’’ అని మద్దాలి చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు.
*అంజనీకుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: భట్టి
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకుండా నాయకుల్ని, కార్యకర్తల్ని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం భట్టి విలేకర్లతో మాట్లాడారు.
*భాగవత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వీహెచ్‌
లౌకిక భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఎవరి తరమూ కాదని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల మంది హిందువులేనంటూ ఇటీవల సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. సదరు వ్యాఖ్యలు దేశంలోని ఇతర వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ సోమవారం ఎల్బీనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
*కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే
రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నేత కేటీ రామారావేనని, ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఆబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్ ముక్కుసూటి మనిషి అని, ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకుడని చెప్పారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తుంటే..తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు..యువత అంతా కేటీఆర్ను చూస్తోందన్నారు. రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలను సైతం పణంగా పెట్టిందన్నారు. యువనేత కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
*సీఏఏకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి:రాజాసింగ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా రేపు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేపట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిజామాబాద్లో సభ నిర్వహించుకునేందుకు ఎంఐఎంకు అనుమతిచ్చారని.. తమకు ఎందుకు ఇవ్వడం లేదో పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
*ఏపీ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు
మంత్రులు, వైకాపా నేతలు రోజుకో మాట మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి. పాలన ఒకేచోట ఉండాలి. అన్ని వసతులూ కల్పించాలి..’’ అని స్పష్టంచేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రాజధానిపై ఇప్పటిదాకా రూ.9,165 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంత ఖర్చుచేశాక రాజధాని మార్చే అధికారం జగన్కు ఎవరిచ్చారంటూ నిలదీశారు. ‘‘భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారి ఉంటారు? జగన్ ఒక్కడికే రాజధాని మార్చాలనే పిచ్చి ఆలోచన వచ్చింది’’ అని మండిపడ్డారు. తమకూ రాజధాని కావాలన్న రాయలసీమ వాసుల డిమాండ్లపై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
*అమరావతి రైతుల ఇబ్బందులపై రాష్ట్రపతికి వినతి
రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులు భవిష్యత్తులో ఎదుర్కొనే ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించినట్లు రాజ్యసభసభ్యుడు సుజనాచౌదరి తెలిపారు. శుక్రవారం బొల్లారంలోని నిలయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు, ప్రభుత్వ ధోరణిపై ఆయన రాష్ట్రపతికి వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాజధానిని ఎందుకు మార్చాల్సి వచ్చిందో స్పష్టతనివ్వని ప్రభుత్వవైఖరితో రైతులు నష్టాలపాలు కావాల్సి వస్తోంది. ఒకప్పుడు అమరావతి రాజధాని తీర్మానాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి జగన్ ఒక విధానం, అభిప్రాయం లేకుండా విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిపాలనపై చిత్తశుద్ధిలేక జగన్ ప్రభుత్వం రాజకీయ విద్వేషాలతో నిర్ణయాలు తీసుకుంటోంది’ అని విమర్శించారు.
*అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్-అమిత్ షా ధ్వజం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎవరి పౌరసత్వాన్నయినా రద్దు చేసే నిబంధన ఏదీ దీంట్లో లేదని స్పష్టం చేశారు. హిమాచల్ప్రదేశ్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఈ చట్టం వల్ల ముస్లింలు పౌరసత్వ హక్కును కోల్పోతారని కాంగ్రెస్ వదంతులు ప్రచారం చేస్తోంది. ఎవరి పౌరసత్వాన్నయినా ఉపసంహరించే నిబంధన ఒక్కటైనా ఈ చట్టంలో ఉందా? అని రాహుల్ బాబాకు సవాలు విసురుతున్నా.
*పౌరచట్టం, ఎన్నార్సీలపై పోరాటానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమించి సీఏఏ, ఎన్నార్సీలను తీసుకువచ్చిందని, అందుకే దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. ఆందోళనల సందర్భంగా జరిగిన పోలీసుల కాల్పుల్లో దేశవ్యాప్తంగా 28 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
*రాజీనామా చేసి మళ్లీ గెలవండి
‘రాష్ట్రంలో మూడు రాజధానులంటూ ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. నాడు ఎన్నికల ప్రణాళికలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు. వైకాపా ప్రభుత్వం రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్ల్లాలి. ఎన్నికల్లో తిరిగి గెలిస్తేనే రాజధానిని అమరావతి నుంచి మార్చాలి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం అమరావతి రైతులు తుళ్లూరులో చేపట్టిన మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షల్లో ఆయన మాట్లాడారు. ‘‘రాజధానిపై జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
*అగ్గిపుట్టిస్తాం: రామకృష్ణ
రాజధానిని మారిస్తే అగ్గిపుట్టిస్తామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శుక్రవారం విజయవాడ నగర సీపీఐ ఆధ్వర్యంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఎర్రదండు మార్చ్ఫాస్ట్ నిర్వహించింది.సభలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
,*రాజధానికి విశాఖ అనుకూలం: సుబ్బరామిరెడ్డి
రాజధానికి విశాఖ అన్ని విధాలా అనుకూలమని, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖ శారదాపీఠంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తన అభిప్రాయం మేరకు రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. దేశానికి దిల్లీ, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మూల ప్రాంతాల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. అయితే, అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.