* గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి. ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ నివేదిక, ఇటీవల నియమించిన హైపవర్ కమిటీ తదితర అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశముంది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజధాని మార్పుపై బిశ్వభూషణ్‌తో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది
* పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురుచూసే విజయవాడ పుస్తక మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో నిర్వహించే ఈ మహోత్సవాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ముప్పై ఏళ్లుగా విజయవాడలో జరిగే పుస్తక మహోత్సవాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. రేపు హైకోర్టులో వివేకా కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషనపై విచారణ ఉన్న నేపథ్యంలో సిట్ తమ దర్యాప్తును ముమ్మరం చేసింది.
* ఎపీఎస్‌ఆర్టీసీ నూతన వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా మాదిరెడ్డి ప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు. 1991వ బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ప్రతాప్‌ను ఏపీఐఐసీ నుంచి ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ బస్ భవన్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు.
* రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. 16 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని రైతులు స్పష్టం చేశారు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల సరఫరా తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తామన్నారు.
* 2020 నూతన సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ఒక మహిళపై చేయి చేసుకున్నందుకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణ చెప్పారు. మహిళలపై అన్ని రకాల హింసను ఖండిస్తూ ప్రసంగం చేయడానికి వెళుతున్న సందర్భంగా ఒక మహిళా భక్తురాలు పోప్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి కరచాలనానికి ప్రయత్నిస్తూ ఆయనను లాగింది.
* అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీపై సీఎం జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలంగా అంకిత భావంతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
*ప్రతి ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి
*బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఉత్తర ఒడిశా పరిసరాల్లో ద్రోణి బలహీనపడినా దాని నుంచి ఉత్తర కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి
*ప్రజలకు ఇంటివద్దకే ఇసుక సరఫరా చేసే కార్యక్రమం కృష్ణా జిల్లాలో గురువారం నుంచి అమల్లోకి రానుంది. రవాణా సదుపాయం బాధ్యతను కూడా ఏపీఎండీసీనే తీసుకుని కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు బుధవారం ఆ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి చెప్పారు.
*గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు
*విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
*దిశ చట్టం అమలుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక చర్యలుదిశ చట్టం అమలు కోసం 87 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు.
*రైతులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు.
పవన్ పర్యటన ఉద్రిక్తతల నడుమ కొనసాగింది.
*అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది.
*నూతన సంవత్సరం సందర్భంగా ఈపూరుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలురాధా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 17 జతల ఎడ్లు పాల్గొన్నాయి.
*ఏపీ రైతులకు జగన్ సర్కారు తీపి కబురు అందించింది. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేయనుంది. పీఎం కిసాన్ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది.
*నూతన సంవత్సరం సందర్భంగా ఈపూరుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలురాధా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 17 జతల ఎడ్లు పాల్గొన్నాయి.
*పాకిస్తాన్‌లో పదో తరగతి వరకు చదువుకున్న ఆ బాలిక స్థానికంగా ఓ స్కూల్లో అడ్మిషన్ పొంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ రెండో సవంత్సరం పరీక్షలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో.. ఎలిజిబిలిటీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో ఆమె ఆందోళన చెందుతోంది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు తక్షణం అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి దామోదరనాయుడుపై ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక విచారణను తప్పుపట్టలేమని హైకోర్టు పేర్కొంది. విచారణ జరిపాక భవిష్యత్తులో సమర్పించబోయే నివేదిక ఒక్కదాని ఆధారంగా మాత్రమే వర్సిటీ ఛాన్స్లర్ హోదాలో గవర్నర్ వీసీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేరని స్పష్టం చేసింది.
*సత్వర న్యాయం అందించడానికి న్యాయమూర్తులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయడంతో వారికి న్యాయస్థానంపై నమ్మకం కలుగుతుందన్నారు.
*రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న తోపులాటలు, ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ మేరకు న్యాయసలహా కోరనున్నట్లు తెలిసింది.
*వ్యవసాయ శాఖకు అవసరమైన ట్యాబ్ల కొనుగోలులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5.91 కోట్లు ఆదా చేసినట్లు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్) అధికారులు తెలిపారు.
*పట్టు వదలని విక్రమార్కుడిలా జాబిల్లిపైకి మరో యాత్ర చేపట్టేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ‘చంద్రయాన్-3’గా పిలిచే ఈ నూతన ప్రాజెక్టును వచ్చే ఏడాది చేపట్టే అవకాశాలున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
*జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది డిసెంబరు నెలకు గాను తెలంగాణలో 13 శాతం, ఏపీలో 11 శాతం వృద్ధి కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా డిసెంబరు నెలలో రూ.1,03,184 కోట్ల మేరకు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు తెలిపింది.
*ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో తాము భాగస్వాములం అవుతామని పింఛనర్ల సంఘం తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య, నేతలు ఇనగంటి నవనీతరావు, మహమ్మద్ రఫీయుద్దీన్, శ్రవణ్కుమార్ తదితరులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కలిసి 3.64 లక్షలమంది పింఛనర్లం ఉన్నామని, అక్షరాస్యత కార్యక్రమంలో తాము వాలంటీర్లుగా పనిచేస్తామని చెప్పారు.
*ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రులను పునర్ వ్యవస్థీకరించారు. రాష్ట్రాన్ని అయిదు భాగాలుగా విభజించి ఏ ప్రాంతం వారు ఎక్కడకి వెళ్లాలో కూడా నిర్ణయించారు.
*సిద్దిపేట జిల్లా ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలతో అరెస్టయి చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న అదనపు డీసీపీ గోవిందు నర్సింహారెడ్డిని వారు కలవడం విమర్శలకు తావిస్తోంది.
*మహా నాయకుడు ఎన్టీఆర్ జీవితం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ’ను రచించినట్లు పుస్తక రచయితలు ఆదాయపు పన్ను విభాగం విశ్రాంత చీఫ్ కమిషనర్ కె.చంద్రహాస్, విశ్రాంత ఐఏఎస్ కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
*పురపాలక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని జాతీయ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘాలు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిని కోరారు.
*రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పాత పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
*నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకొని పోలీసులకు ఇచ్చే పతకాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్, విజిలెన్స్, అనిశా విభాగాలతోపాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక విభాగాల్లో నుంచి 640మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు
*ఒడిశా ఉత్తర ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. 2 రోజుల క్రితంతో పోలిస్తే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా నల్గొండలో 14.6, ఆదిలాబాద్లో 14.7, మెదక్లో 15.4, హైదరాబాద్లో 18.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
*ప్రతిష్ఠాత్మక సంస్థ ‘షహీద్ మేళా బేవర్-ఉత్తర్ప్రదేశ్’ అధ్యక్షుడిగా ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మేళా కమిటీ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంస్థ సంచాలకులు రాజ్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏటా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు షహీద్ మేళా జరుగుతుందని, స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన త్యాగధనులను స్మరిస్తూ లక్షలాది మంది ఈ ఉత్సవంలో నీరాజనం పలుకుతారని వివరించారు.
*రైల్వే ప్రయాణికులకు కొత్త ఏకీకృత సహాయ నంబర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గతంలో వేర్వేరు నంబర్లకు ఫిర్యాదులు చేయాల్సి వచ్చేది.
గవర్నర్‌తో జగన్ భేటీ-తాజావార్తలు
Related tags :