Sports

గుత్తా జ్వాల ప్రేమాయణం

Guttha Jvala Love Story With Tamil Actor

ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల… ఓ తమిళ నటుడు ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లుగా విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.లేటెస్టుగా న్యూ ఇయర్ వేడుకల్లోనూ ఈ జంట కలిసి ఎంజాయ్ చేసింది. తనను ముద్దాడుతున్న విష్ణు ఫోటోను జ్వాల స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోతో ఇద్దరి మధ్య ఎఫైర్‌ బహిరంగమైపోయిందంటూ నెటిజన్లు తెగ కామెంట్‌ చేస్తున్నారు. విష్ణు విశాల్‌ తమిళంలో దాదాపు 14 సినిమాల్లో నటించాడు.