ScienceAndTech

స్పేస్ వాక్‌లో సరికొత్త రికార్డు

NASA Christina Writes New Record With Space Walk

అమెరికా వ్యోమగామి క్రిస్టినా కోచ్ అంతరిక్షంలో సరికొత్త రికార్డును సృష్టించారు. అంతరిక్ష యాత్రలో భాగంగా నాసా నుంచి వెళ్లిన ఆమె స్పేస్వాక్లో నేటికీ కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలంగా అంతరిక్షంలో గడిపిన మొదటి మహిళా వ్యోమగామిగా క్రిస్టినా కోచ్ చరిత్ర సృష్టించారు.క్రిస్టినా కోచ్ అమెరికన్ ఇంజినీర్, నాసా వ్యోమగామి. ఆమె ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఫిజిక్స్లో ఉన్నత విద్యలను అభ్యసించారు. 2001లో నాసా అకాడమీ నుంచి పట్టభద్రులయ్యారు. 2013లో 21 మంది నాసా ఆస్ట్రోనాట్ టీమ్లోకి ఎంపికయ్యారు. 2015 నాటికి ఆస్ట్రోనాట్ శిక్షణ పూర్తి చేశారు. అనంతరం నాసా ప్రయోగించే అంతరిక్షయాత్రకు క్రిస్టినా ఎంపికయ్యారు. 2019 మార్చి14న నాసా నుంచి స్పేస్ మిషన్ ప్రారంభించారు. ఆర్నెళ్ల అంతరిక్ష యాత్రలో భాగంగా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు. ఏప్రిల్ 17న స్పేస్ మిషన్ షెడ్యుల్ను నాసా పొడిగించింది.మరింత పరిశోధన కోసం క్రిస్టినా కోచ్ స్పేస్ మిషన్ ఉపయోగపడుతుందని నాసా అంటున్నది. వ్యోమగాముల ఆరోగ్యం, స్పేస్ ఫ్లయిట్ సమాచార సేకరణ గురించి మరింత పరిశోధన చేసే అవకాశం ఉందని శాస్త్రజ్ఞలు అంటున్నారు. డిసెంబర్ 28నాటికి క్రిస్టినా అంతరిక్షంలోకి వెళ్లి 289 రోజులు పూర్తయింది. దీంతో ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన మహిళా వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించింది. అంతకు ముందున్న పెగ్గీ విట్సన్ రికార్డును క్రిస్టినా బ్రేక్ చేసింది. కాగా క్రిస్టినా 2020 ఫిబ్రవరిలో భూమిని చేరుకోనుంది. అప్పటితో 335 రోజులు అంతరిక్షంలో పూర్తవుతాయి.