DailyDose

చంద్రబాబుకు సొంత ఎమ్మెల్యే సెగ-రాజకీయ

Own MLA Tortuting Chandrababu-Telugu Political News Roundup Daily

*టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్యే మద్దాలి గిరిసమస్యలు చెప్పడం కూడా తప్పేనా ?నియోజకవర్గ అభివృద్ధి, బకాయిల గురించి చర్చించేందుకే సీఎంని కలిశాను నాతో సంప్రదించకుండా ఇన్ఛార్జ్ ని ఎలా నియమిస్తారుమీ సామాజిక వర్గానికొక న్యాయం, మాలాంటి వారికి ఒక న్యాయమా ? వివరణ కోరుతూ చంద్రబాబుకు లేఖ రాయనున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్.
* అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ దక్కే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇక హోంశాఖ కూడా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. నీటి పారుదల శాఖ జయంత్‌ పాటిల్‌, గృహనిర్మాణ అభివృద్ధి శాఖ జితేంద్ర అహ్వద్‌కు, ఎడ్యుకేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ శాఖలు ఆదిత్య థాకరేకు కేటాయించనున్నట్లు సమాచారం. కీలకమైన పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అశోక్ చవాన్ కు దక్కే అవకాశం ఉంది.మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిసెంబర్ 30న తన క్యాబినెట్‌ను విస్తరించిన విషయం విదితమే. డిప్యూటీ సీఎంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్‌తోపాటు మొత్తం 26 మంది క్యాబినెట్, 10 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
* రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు: బొత్స
రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం అనుకూలమని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత సీనియర్‌ను, అనుభవం ఉన్న వ్యక్తిని అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అడిగారు. దాంతో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక టౌన్‌ షిప్‌ కడితే సంపద వస్తుందా? ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగితే పెరిగి ఉండొచ్చు.. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధిచెందుతాయా?’’ అని బొత్స ప్రశ్నించారు.
* ప్రియాంకపై మాయావతి ధ్వజం
కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. రాజస్థాన్‌ కోటాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక నెలలో 100 మంది చిన్నారుల మృతి చెందిన ఘటనపై ప్రియాంక స్పందించకపోవడం దారుణమని మాయావతి పేర్కొన్నారు. ఒక వేళ ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే ప్రియాంక తప్పక స్పందించే ఉండేది. ఎందుకంటే అవకాశవాద రాజకీయాల కోసం ప్రియాంక కచ్చితంగా స్పందిస్తుండే అని మాయావతి చెప్పారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది కాబట్టే ఆమె ఉదాసీనత చూపుతున్నారని బీఎస్పీ చీఫ్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రజలు గమనించాలని మాయావతి సూచించారు. కోటా చిన్నారుల మృతిని రాజస్థాన్‌ ప్రభుత్వం ఖండించాలి. కానీ ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తుందని మాయావతి నిప్పులు చెరిగారు.
* తుగ్లక్ పాలన పేరే విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం: దేవినేని ఉమా
వైసీపీ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుగ్లక్ పాలన పేరే విన్నామని, ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. విశాఖలో‌ విజయసాయిరెడ్డి బ్యాచ్ వేలాది ఎకరాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. అమరావతిని కనుమరుగు చేయాలని సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
* అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా: జేపీ
ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనేక రాష్ట్రాల్లో సంక్షోభం రానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని తీర్చలేకపోతోందని విమర్శించారు. తాను పార్టీని స్థాపించింది పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. రాజకీయం అంటే కోట్ల రూపాయలతో కూడిన ఖర్చని, అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని జయప్రకాష్‌ నారాయణ స్పష్టం చేశారు.
*కృత్రిమ మేధా సంవత్సరంగా 2020: కేటీఆర్‌
2020ని తెలంగాణ రాష్ట్రం కృత్రిమ మేధా సంవత్సరంగా జరుపుకోనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా telangana’s year of AI లోగోను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఇంటెల్‌, పీహెచ్‌ఎఫ్‌ఐ, అడోబ్‌, నివిడ. హెక్సాగన్‌ సంస్థలతో ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ‘సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఏఐ’ ఏర్పాటు కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ హైదరాబాద్‌ ..మౌలిక సదుపాయాలు, స్టాటజీ భాగస్వామిగా వ్యవహరించనుంది.
రిజిస్ట్రేషన్‌ శాఖతో పాటు పోలీస్‌ శాఖలో పైలట్‌ ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. telangana’s year of AI వెబ్‌సైట్‌ను ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ప్రారంభించారు.
*రాష్ట్రాన్ని రక్షించుకోవాలి: యనమల
మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడంతో రాష్ట్రం బ్రాండ్‌ విలువ పడిపోయే ప్రమాదముందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘రాష్ట్రం అభివృద్ధి చెందటానికి సంపద ముఖ్యం. సంపద సృష్టించటానికే గత ఐదేళ్లు కష్టపడ్డాం. విశాఖపట్నం మినహా ఆర్థిక వనరులు ఉన్న మరో నగరం రాష్ట్రంలో లేదు. అందుకే ప్రపంచమంతా అధ్యయనం చేశాకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం. ఆర్థిక వేత్తలు కూడా ఈ రోజు అదే విషయం చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వృద్ధిరేటు బాగా పెరిగింది. భారీగా పెట్టుబడులు తీసుకురాగలిగాం. మూడు సదస్సులతో పెట్టుబడులు ఆకర్షించాం..ఐదు లక్షల వరకు ఉద్యోగాలు కల్పించాం. సంపద పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధిచెందుతుంది. సీఎం జగన్‌ రాష్ట్ర సంపద గురించి పట్టించుకోకుండా.. తన సంపద, అనుచరుల సంపద పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి రైతులకు సంబంధించిన అంశం కాదు.. ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశం. ఈ రాష్ట్రాన్ని అధోగతిపాల్జేసి మిగతా రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కడప, బెంగళూరు, హైదరాబాద్‌లో జగన్‌ ప్యాలెస్‌లు కట్టుకున్నారు. రేపు విశాఖ వెళ్తే అక్కడ మరో ప్యాలెస్‌ కడతారా? వైకాపా ఫ్యాన్‌కు మూడు రెక్కలు ఉంటే.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారు
*జీవితాలనైనా పణంగా పెడతాం.. అండగా నిలుస్తాం
కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం రోజంతా రాజధాని కోసం పోరాడుతున్న రైతుల మధ్య గడిపారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మద్దతు ప్రకటించారు. ఉదయం 10.40 నుంచి సాయంత్రం 5 గంటలు దాటేంత వరకు అమరావతి ప్రజలతో ఉన్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడంలలో దీక్షల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడులకు ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు… ఆయన సతీమణి భువనేశ్వరి తన చేతికున్న బంగారు గాజులు తీసి విరాళంగా అందజేశారు. వాటిని వేలం ద్వారా విక్రయించాలని, ఆ సొమ్మును ఐకాసకు ఇవ్వాలని చంద్రబాబు రైతులకు సూచించారు.
*రాజధానిపై మంత్రి పెద్దిరెడ్డి కీలకవ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 10 శాతం ప్రజలకూ సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక అనంతరం రాజధానిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభను సమావేశపరిచి రాజధానిపై ప్రకటిస్తామన్నారు.
*నాకు వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు:ఈటల
ప్రజల కోసం నేతలు చేసే మంచి పనులకు ఓట్లు పడతాయే తప్ప.. మద్యం సీసాలు పంచితే పడవని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లిలో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలోని తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఈ పదవి అమ్మానాన్నలు ఇచ్చింది కాదు. ప్రజలు పెట్టిన ఓట్ల భిక్ష. నా దృష్టిలో ప్రజలు చాలా గొప్పవారు’ అని అన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చెరో 30 స్థానాలు ఉన్నాయని.. త్వరలోనే ఈ మున్సిపాలిటీల్లో కమిటీలు వేయనున్నట్లు చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం స్థానాల్లో గెలిచే సత్తా తెరాసకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఐక్యంగా పనిచేసి ప్రతిఒక్కరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
*ఏడోతేదీలోపే ‘పుర’ అభ్యర్థుల జాబితా: కేటీఆర్
రానున్న పురపాలక సంఘాల, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను ఈనెల ఏడోతేదీ లోపు సిద్ధం చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు(కేటీఆర్) పార్టీ ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఎన్నికల అంశంపై బుధవారం తెలంగాణభవన్లో ఆయన రాష్ట్ర కమిటీ నేతలు, సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల ఎనిమిది నుంచి కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల కోసం నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి. దానికంటే ముందే జాబితాలు ఖరారుచేయాలి. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకొని వివరాలు సేకరించాలి
*పురపాలక ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలకు మేనిఫెస్టో కమిటీని నియమిస్తూ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా బుధవారం ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ఈ కమిటీకి ఛైర్మన్గా ఉంటారు. రాములునాయక్, బెల్లయ్యనాయక్, ఎస్ఏ సోహయిల్, ఆకుల రాజేందర్ ముదిరాజ్, ఎ.చంద్రశేఖర్, ఎం.జయపాల్రెడ్డి, పాల్వాయి స్రవంతి, సత్యం శ్రీరంగం, గాలి అనిల్కుమార్, పవన్ మల్లాడి తదితరులు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ సమావేశమై పురపాలక ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ఈ నెల 4వ తేదీ లోగా టీపీసీసీకి అందజేయాలని కుంతియా సూచించారు.
*తప్పు చేశారు కాబట్టే జగన్కు భయం:చంద్రబాబు
హైదరాబాద్కు దీటుగా మరో నగరం ఉండాలనే అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహారదీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. త్వరలో సీఎం జగన్ నివాసానికి శాశ్వతంగా కంచె వేసుకునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి కోసం దేవాలయాల్లో పూజలు చేశామని.. కానీ ఇప్పుడు జగన్ దిష్టి రాజధానికి తగిలిందని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు గౌరవం ఇచ్చేవారని.. సమవుజ్జీల పోటీ అంటే అది అని అన్నారు. రాజధాని ప్రాంతంలో 75శాతం బడుగు బలహీనవర్గాలు ఉన్నాయని చెప్పారు. డమ్మీ కాన్వాయ్ పంపిస్తే తప్ప.. సీఎం రావట్లేదన్నారు. తప్పు చేశారు కాబట్టే జగన్కు అంతభయమని.. తనకు, పవన్ కల్యాణ్కు ప్రజలే పోలీసులని చెప్పారు. భువనేశ్వరి మాట్లాడుతూ మహిళలు రోడ్డుపైకి రావడం తొలిసారని.. అంతా కలిసి అమరావతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ రైతుల గురించే ఆలోచించే వారని.. ఆయన ఊపిరి నిండా అమరావతే ఉందని చెప్పారు.
*కాపులపై కేసులు పెట్టినప్పుడు స్పందించలేదేం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డినే విమర్శిస్తున్నారని, తెదేపా అధినేత చంద్రబాబుకు పరోక్షంగా మద్దతునిస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతులపై కేసులు పెట్టారని పవన్ విమర్శిస్తున్నారని, మీడియా ప్రతినిధులపై దాడులు చేసిన వారిపై మాత్రమేనన్నది తెలుసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల కోసం కంచాల చప్పుడుతో లోగడ కాపులు ధర్నా చేసినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, దీనిపై అప్పుడు పవన్కల్యాణ్ నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు.
*దేశ ప్రగతికి కాంగ్రెస్ విఘాతం-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ధ్వజం
ముస్లింలు, ఇతర మైనారిటీల్లో అభద్రతా భావాన్ని సృష్టించి దేశ ప్రగతికి విఘాతం కలిగించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు గోల్డెన్పార్కులో మంగళవారం భాజపా రాయలసీమ జిల్లాల మండలాధ్యక్షులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఏఏ చట్టం చదవకుండా.. సారాంశాన్ని అర్థం చేసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. అధికార దాహంతో కులమతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని ఆరోపించారు. జనవరి 4న కడపలో నిర్వహించే భాజపా ర్యాలీకి పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారని తెలిపారు. కడప ర్యాలీని విజయవంతం చేయాలని భాజపా నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిలుపునిచ్చారు
*విశాఖను రాజధానిగా ఆహ్వానిస్తున్నా-గంటా శ్రీనివాసరావు
ఏళ్లుగా విశాఖపట్నంలో ఉంటున్నానని, రాజధానిగా చేస్తామంటే ముందుగా స్వాగతించేది నేనే అని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవద్దన్న తమ నాయకుడు చంద్రబాబునాయుడు పిలుపును తాము పాటిస్తున్నామని చెప్పారు. మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రంలో సదుపాయాలను తెలుసుకోవడానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
*సమన్యాయం చేయాలి: టీజీ
రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి తప్ప, ఏకపక్ష నిర్ణయం ఉండకూడదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఆత్రేయపురం మండలం వాడపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. తమ ప్రాంత అభివృద్ధికోసం రాయలసీమ ఐక్యవేదిక ద్వారా 14 ఏళ్లుగా పోరాటం సాగించామన్నారు. కర్నూలుకు హైకోర్టు వస్తుందన్న ఆశతో ఉన్నామని, విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తే తమ ప్రాంతానికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
*విశాఖలో 36 వేల ఎకరాలు చేతులు మారాయ్: దేవినేని
ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో 36వేల ఎకరాలు చేతులు మారాయని, అందులో ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులు 6వేల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని… మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం సన్నిహితులతో పాటు మంత్రులూ బినామీలతో భూములు చేజిక్కించుకున్నారన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడ గొల్లపూడి గ్రామంలో 24 గంటల నిరాహార దీక్షను మంగళవారం ఉదయం 11 గంటలకు ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. బుధవారం ఉదయం వరకు దీక్ష కొనసాగుతుంది. ‘‘అమరావతిపై ఉన్నతస్థాయి కమిటీ పేరుతో ఏమీరాని కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారిని నియమించారు. వారు 5కోట్ల మంది ప్రజల జీవితాలను మారుస్తారా?’’ అని ప్రశ్నించారు.
*కాళేశ్వరం పునరాకృతిలో అవినీతి: లక్ష్మణ్
పునరాకృతి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది వాస్తవమని.. ఇంజినీర్లు ఇచ్చిన ఆకృతిని గుత్తేదారులకు అనుకూలంగా మార్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. అవినీతి లేకుంటే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు ఎదురుదెబ్బ తగులుతుందన్న విషయాన్ని గ్రహించిన సీఎం ప్రజల దృష్టిని మరల్చేందుకు మధ్య మానేరు జలాశయాన్ని సందర్శించారని వ్యాఖ్యానించారు.
*ఎన్నికల కమిషన్ చేతులు కట్టేసిన రాష్ట్ర ప్రభుత్వం : రావుల
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దాని చేతులు కట్టేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలన్నారు. నూతన మున్సిపల్ చట్టంలో సెక్షన్ 195 పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే ఎన్నికలు జరపాలనే నిబంధన పెట్టారని విమర్శించారు.