Politics

79ఏళ్ల బామ్మగారు…గెలిచింది

79 Year Old Tamil Granny Wins Elections

అది ఏ పదవి అయినా సరే ప్రస్తుత రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు కుమ్మరించాల్సిందే. డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవడమంటే పెద్ద వింతే. అంతేకాకుండా అది కూడా 79 ఏళ్ల వయసులో గెలవడమంటే మాములు విషయం కాదు. అలాంటి వింతే తమిళనాడులో జరిగింది.మధురై జిల్లాలోని మెలురు తాలూకా, అరిత్తపట్టి గ్రామానికి చెందిన వీరమ్మల్ అజగప్పన్ అనే 79 ఏళ్ల వృద్ధురాలు లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసింది. ఆమెకు ప్రత్యర్థులుగా మరో ఏడుగురు కూడా పోటీ చేశారు. వారంతా వీరమ్మల్‌ను చూసి ఇంత వయసులో ఆమె గెలుస్తుందా అనుకున్నారు. గెలిచినా ఏ పని చేయలేదని ప్రచారం కూడా చేశారు. అందుకే తమకే ఓటు వేసి గెలిపించాలని ఆ గ్రామ ప్రజలను కోరారు. కానీ, అందుకు భిన్నంగా ఆ ఊరి ప్రజలు వీరమ్మల్‌ను 190 ఓట్ల మేజారిటీతో గెలిపించారు. ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చారు. తన గెలుపుకు గ్రామ యువతే కారణమని వీరమ్మల్ అంటున్నారు. ఈ వయసులో తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ వీరమ్మల్ ధన్యవాదాలు తెలిపింది. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ.. ప్రజలకు సేవచేయడమే తన లక్ష్యమని వీరమ్మల్ తెలిపింది.