Health

మీకు అల్సర్లు ఉన్నాయో లేదో తెలిసేది ఇలా?

Check your ulceritis symptoms here

జీర్ణవ్యవస్థలోని పెద్దపేగు లోపలి వైపు వాపు వచ్చినా, మ్యూకస్ పొర దెబ్బ తిన్నా అల్సరేటివ్ కొలైటిస్ వస్తుంటుంది. ఆరంభంలో దీని లక్షణాలు కనిపించకపోయినా వ్యాధి క్రమంగా ముదిరేకొద్దీ లక్షణాలు క్రమేపీ బయటపడతాయి. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, అలసట, జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత, ఆకలి లేకపోవడం, రక్తంతో కూడిన విరేచనాలు, లివర్ సమస్యలు, డీ హైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి కచ్చితంగా ఎందుకు వస్తుందో ఇప్పటికీ సైంటిస్టులు తేల్చలేకపోతున్నారు. కానీ ఈ వ్యాధి జన్యు పరంగా లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావం, జీవనశైలిలో లోపాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌ల వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ కచ్చితమైన డైట్ పాటించాలి. అలాగే కింద తెలిపిన పలు సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…

* టీ, కాఫీ, ఆల్కహాల్‌లకు బదులుగా గ్రీన్ టీ లేదా తులసి టీ తాగితే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు. అలాగే పొగతాగడం, పొగాకు నమలడం కూడా మానేయాలి. లేదంటే వ్యాధి మరింత తీవ్రతరమవుతుంది. ఇక కారం, మసాలాలు దట్టించిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. పుల్లని పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోరాదు. ఇవి జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది.

* కారంతో చేసిన కూరలు కాకుండా.. ఉడకబెట్టిన కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర, బీరకాయ, ఆనపకాయ తదితర కూరగాయలను ఉడికించి తినాలి. ఇక ముల్లంగి, కీరదోస, పుచ్చకాయ, చింతపండు తినడం మానేయాలి. అలాగే పచ్చి కూరగాయలు కూడా తినకూడదు.