DailyDose

ముఖ్యమంత్రి నివాసంలో దెయ్యాలు-నేరవార్తలు

Chief Minister's House Haunted-Telugu Crime News Roundup Daily Today

* బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేంటంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ నివాసంలో దెయ్యాలు తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. పైగా, ఈ దెయ్యాలను వదిలి వెళ్లింది కూడా ఎవరో కాదట. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అని ఆయన సెలవిచ్చారు. ఇంతకీ నితీశ్ కమార్ అలా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన భవనం విశాలంగా ఉండేదని, ఇంటి వెనుక భాగంలో మట్టికుప్పలు, ఇంటి నలుమూలల్లో కాగితపు కవర్లు కనిపించాయని, తన కోసం కొన్ని దెయ్యాలను ఆ ఇంట్లో వదిలేసి వెళ్లానని లాలూ స్వయంగానే తనతో అన్నారని నితీశ్ వ్యాఖ్యానించారు. లాలూ తనదైన స్టయిల్‌లో ఈ మాటలు అనివుండవచ్చని నితీశ్ చెప్పినా, ఆయన మాటలు మాత్రం ఇప్పుడు బీహార్‌లో చర్చనీయాంశమయ్యాయి. గతంలో లాలూకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కాళీమాత ఆలయంలో నితీశ్ ప్రత్యేక పూజలు చేయించారని, ఈ విషయాన్ని తాంత్రికుల నుంచి తెలుసుకున్న లాలూ, పూజల ప్రభావం తనపై పడకుండా చూసుకునేందుకు ప్రత్యేక పూజలు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి
* తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, మరోవైపు తనకు పిల్లలు పుట్టడం లేదన్న ఆవేదనతో మద్యం మత్తులో ఉన్న బాబు కిచెన్ లోకి వెళ్లి ఓ కత్తి తెచ్చుకుని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు.
* దాదాపు రూ.9 కోట్ల విలువైన మేథంఫిటమిన్‌(యాబా) మాత్రలను సరిహద్దు భద్రతా బలగాల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన త్రిపురలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. త్రిపుర-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతం రాయెర్మురా ఔట్‌పోస్ట్‌ వెంబడి బొర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), డైరక్టేరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డీఆర్‌ఐ) సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా 1,68,500 యాబా మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 8.52 కోట్లుగా సమాచారం.
*ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటిన వేళ జర్మనీలో విషాదం చోటుచేసుకుంది. సమీపంలో సంబరాలు జరుగుతుండగా.. క్రెఫెల్డ్‌ జంతు ప్రదర్శనశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 30కి పైగా మూగజీవాలు సజీవ దహనమయ్యాయి.
* లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
* అంతరాష్ట్ర తుపాకీల అక్రమ రవాణాదారును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తుపాకీల అక్రమ రవాణాదారు సాజిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి 20 పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా .32 బోర్‌ సెమిఆటోమేటిక్‌ పిస్ట్స్‌, 315 బోర్‌ సిగ్నల్‌ షాట్‌ పిస్టల్స్‌, 50 లైవ్‌ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* దాదాపు రూ.9 కోట్ల విలువైన మేథంఫిటమిన్‌(యాబా) మాత్రలను సరిహద్దు భద్రతా బలగాల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన త్రిపురలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది.
*బేగంబజార్‌లో విదేశీ సిగరెట్లు పట్టివేత
హైదరాబాద్‌ నగరంలోని బేగంబజార్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఓ దుకాణంలో రూ.12 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
* అంతరాష్ట్ర తుపాకీల అక్రమ రవాణాదారును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తుపాకీల అక్రమ రవాణాదారు సాజిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి 20 పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా .32 బోర్‌ సెమిఆటోమేటిక్‌ పిస్ట్స్‌, 315 బోర్‌ సిగ్నల్‌ షాట్‌ పిస్టల్స్‌, 50 లైవ్‌ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో నైహతి ప్రాంతంలో ఉన్న ఒక బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు వ్యక్తులు మరణించారు. అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
* హైదరాబాద్‌ నగరంలోని బేగంబజార్‌లో గల ఓ దుకాణంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.12 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను గుర్తింంచిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని షాహీనాయత్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు
* తాగుడుకు బానిసై తరుచూ భార్యను అనుమానించే ఓ భర్త ఇంట్లో నిద్రిస్తున్న భార్య బిడ్డలపై కిరోసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పంటించిండు. తాగిన మత్తులో తనూ కిరోసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోసుకొని మంటలు అంటించుకున్నడు. వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలో జరిగిన ఈ దారుణంలో ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదివే కూతురు, నిప్పంటించిన సైకో తండ్రి మృతిచెందగా తీవ్రంగా గాయపడిన భార్య దవాఖానాలో చావుబతుకుల మధ్య ఉన్నారు.
* ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే విమానం కుప్పకూలి 18 మంది మృతి చెందిన ఘటన సుడాన్‌లో చోటుచేసుకుంది.
*కామాంధులు రెచ్చిపోవడంతో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మానవులే మృగాలుగా మారిపోతున్న తరుణంలో.. ఓ మృగం లైంగిక కోరికలతో ఆడపులిని మెడకొరికి చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో చోటుచేసుకుంది.
* శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు కుట్ర చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
* ఈ కామర్స్‌లో మరో మోసాన్ని సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేశారు. బిహార్‌లోని కబీర్‌పూర్‌కి చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ కామర్స్‌ నుంచి డేటాను సేకరించి బహుమతుల పేరుతో వినియోగదారులకు గాలం వేస్తోంది. ఈ కామర్స్‌లోని డేటా లేకేజీపై దృష్టిపెట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బిహార్‌ ముఠా అక్రమాలను గుర్తించారు.
* దిల్లీలో గురువారం సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక దళానికి చెందిన ఉద్యోగి అమిత్‌ బలియాన్‌ మృతి చెందారు.
* చందానగర్‌లో భారీ చోరీ జరిగింది. అమీన్ రహదారిలో కృష్ణవేణి స్కూల్‌పైన ఉన్న ఐటీసీ ఆశీర్వాద్ డిస్ట్రీబ్యూటర్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి తెగబడ్డారు. దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే సిగరేట్ బాక్సులుఇతర ఉత్పత్తులను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మొత్తంలో చోరీ జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
* రాష్ట్రంలోని పూరీ జిల్లా బలాంగలో డిసెంబర్‌ నెలలో బాలికపై కానిస్టేబుల్‌తో పాటు ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళపై ఏఎస్‌ఐ అత్యాచారం చేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్‌ఐ చిత్తరంజన్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల కేసును పరిష్కరిస్తామంటూ ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది.
*రంగురాళ్లతో అదృష్టం కలిసి వస్తుందని ఓ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఆళ్లపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
*జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్ శివారులో అదే గ్రామానికి చెందిన తనుగుల మాధవి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైంది.
*వరంగల్ రూరల్ జిల్లాలోని ఖానాపూరం మండల కేంద్రానికి సమీపంలో పాకాల వాగు వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది.
*వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడేందుకు బీమా సొమ్ము కోసం చోరీ నాటకం ఆడిన నగల వ్యాపారులు పోలీసులకు దొరికిపోయారు.
*చోరీలు చేయాలనుకునే వ్యక్తులు అందుకు అవసరమైన పరికరాలు, సరంజామా వెంటతెచ్చుకోవటం సహజం.. వాటిని సైతం అపహరించుకుని వచ్చి దోపిడీలకు పాల్పడేవారు ఉంటారా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది కింది సంఘటనను గమనిస్తే.. వెల్డింగు దుకాణం నుంచి ఎత్తుకొచ్చిన గ్యాస్కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.7.12 లక్షలు దోచుకున్నారు.
*వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి సమీపంలోని పాకాల వాగు వంతెనపై గురువారం అర్ధరాత్రి టిప్పర్ ఢీకొని 250 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి
*రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతుల రాకెట్ రాజ్యమేలుతోందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్కు సంచలనాత్మక లేఖ రాశారు. పదవిని, ప్రదేశాన్ని బట్టి భారీ మొత్తాలు చేతులు మారుతాయని నొయిడా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) వైభవ్ కృష్ణ తన లేఖలో వివరించారు
*పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లి నలుగురు కుటుంబసభ్యులు మృత్యువాత పడిన సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతానికి చెందిన ముంతాజ్ తన పిల్లలతో కలిసి కడపలోని ప్రకాశ్నగర్లో ఉన్న తన సోదరుడు అన్వర్ ఇంటికి వచ్చింది.
*జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
*మద్యం తాగి కారు నడపడం నిబంధనలకు విరుద్ధం.. ఇవేమీ పట్టించుకోని నలుగురు యువకులు పూటుగా తాగారు.. ఆపై కారు నడుపుతూ వెళ్లారు. ఈక్రమంలో రోడ్డుపై తనిఖీలు నిర్వర్తిస్తున్న ఎస్సైను తమ వాహనంతో ఢీకొట్టారు. ఆపై పారిపోయే ప్రయత్నం చేయబోయారు.. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.
*అనుమానంతో భార్యను, ఆమెపై దాడి చేసినప్పుడల్లా అడ్డువస్తుందని కుమార్తెను వేధిస్తూ వచ్చిన ఉన్మాది ఆ ఇద్దరికి నిప్పుపెట్టి చంపేందుకు తెగబడి తానూ బలయ్యాడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో తండ్రి, కుమార్తె చనిపోగా తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
*విద్యుదాఘాతానికి గురైన తల్లిని కాపాడే యత్నంలో ఓ బాలిక మృత్యువాత పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో చోటుచేసుకుంది.
* పత్తి ఏరడానికి పంట చేనులోకి వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాత్రి ఆమె ఇంటికి రాకపోవడంతో గురువారం ఉదయం వెదకగా పత్తిచేను పక్కన పొదల్లో మృతదేహం లభ్యమైంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
* నటి తనుశ్రీ దత్తా న్యాయవాది నితిన్‌ సాట్పుటేపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాంద్రా పశ్చిమ సబర్బ్‌ ప్రాంతంలో ఓ మహిళను దుర్భాషలాడినందుకుగాను కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
* రాజస్థాన్ భరత్‌పూర్‌లో జరిగిందో ఘోర ప్రమాదం. సంత్ గ్రామంలో ఓ ట్రక్, కారు బలంగా ఢీకొన్నాయి. వెంటనే ట్రక్ నుంచీ మంటలు చెలరేగాయి.
* ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కీచకుల్లో మార్పు రావడం లేదు. నిర్భయదిశ లాంటి చట్టాలు వచ్చినా వేధింపులు మాత్రం ఆగడం లేదు. వేధింపులకు గురిచేస్తున్న ఓ ఆకతాయికి మహిళలు బడిత పూజ చేశారు. ఫోన్‌లో జులాయి వేధింపులు భరించలేక యువతి బంధువులకు తెలియజేసింది. పక్కా ప్లాన్‌ ప్రకారం యువకుడ్ని పిలిచి దేహశుద్ధి చేశారు.