DailyDose

పసిడికి రెక్కలు వచ్చాయి-వాణిజ్యం

Gold Prices On High Rise-Telugu Business News Roundup Daily

* బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రూపాయి క్షీణతతో పసిడి ధర అమాంతం పెరిగింది. ఆ ప్రభావం దేశీయ ధరలపైనా పడింది. దీంతో బులియన్‌ మార్కెట్లో పుత్తడి ధర మళ్లీ 40వేల మార్క్‌ను దాటింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 752 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,652 పలికింది. అటు వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. రూ. 960 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 48,870కి చేరింది.
*దేశంలో చక్కెర ఉత్పత్తి ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వచ్చే సెప్టెంబరు వరకు సాగే ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం తొలి మూడు నెలల (అక్టోబరు-డిసెంబరు) కాలంలో దేశంలో 77.9 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. గత ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 1.12 కోట్ల టన్నులతో పోల్చితే 30.22 శాతం తగ్గినట్టు భారత చక్కెర మిల్లుల సంఘం (ఇస్మా) ప్రకటించింది. 2014-15 తర్వాత చక్కెర ఉత్పత్తి ఈ స్థాయికి దిగజారడం ఇదే ప్రథమం. ప్రస్తుతానికైతే మార్కెట్లో చక్కెర ధర స్థిరంగానే ఉన్నప్పటికీ ఉత్పత్తిలో క్షీణతను పరిగణనలోకి తీసుకుంటే రాన్ను కాలంలో ధరలు పెరిగే అవకాశం లేకపోలేదన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
*ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (యూబీఐ).. ఈ నెలలో దాదాపు రూ.2,836 కోట్ల విలువైన మొండి బకాయిల (ఎన్పీఏ)ను విక్రయించనున్నాయి.
*ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వివిధ కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఒక్కో ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు ఒక్కోలా ఉంటున్నాయి. దీంతో ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలో వినియోగదారులకు పాలుపోవడం లేదు. ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు ఆరోగ్య, సాధారణ బీమా పాలసీలు అందించే ప్రతి కంపెనీ తప్పనిసరిగా ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో ప్రత్యేక ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీ ప్రారంభించాలని ఆదేశించింది.
*అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఎంహెచ్ఐ)లో 51.2ు వరకూ వాటాను హెచ్డీఎఫ్సీ కొనుగోలు చేస్తోంది. అనంతరం ఏఎంహెచ్ఐని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్లో విలీనం చేస్తుంది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ (ఏహెచ్ఈఎల్), అపోలో ఎనర్జీ కంపెనీ (ఏఈసీఎల్) తదితరాల నుంచి ఈ వాటాను హెచ్డీఎఫ్సీ సొంతం చేసుకుంటోంది.
*ఎయిర్ ఇండియా (ఏఐ)ను ప్రైవేటీకరించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఏఐకి చెందిన 13 యూనియన్లతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. ఏఐకు ఉన్న 80 వేల కోట్ల అప్పును తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవని, దీనికి ఉద్యోగుల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
*సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా (ఎస్ఈఐఎల్)కు చెందిన విద్యుత్ ఆస్తుల్లో ఉన్న 5.95 శాతం వాటాను ఎస్ఈఐఎల్కు గాయత్రీ ప్రాజెక్ట్స్ (జీపీఎల్) విక్రయించింది. గాయత్రీ ఎనర్జీ వెంచర్స్ (జీఈవీపీఎల్) ద్వారా గాయత్రీ ప్రాజెక్ట్స్ ఈ వాటాను కలిగి ఉంది. వాటా విక్రయం ద్వారా రూ.406.77 కోట్లు లభించినట్లు గాయత్రీ ప్రాజెక్ట్స్ వెల్లడించింది. ఇందులో రూ.206.85 కోట్ల ను గాయత్రీ ఎనర్జీ వెంచర్స్ జారీ చేసిన డిబెంచర్ల రీపేమెంట్కు వినియోగించనుంది.
*నిఫ్టీ రికవరీలో ప్రారంభమై రోజంతా నిలకడగా అప్ట్రెండ్ కొనసాగించింది. చివరికి 100 పాయింట్ల లాభంతో డే గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. స్వల్పకాలిక నిరోధం 12300కి చేరువవుతోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడే బలమైన నిరోధం ఎదుర్కొంటోంది. మూడోసారి ఇక్కడ ఎదుర్కొంటున్న పరీక్షలో తప్పనిసరిగా బ్రేకౌట్ చేయాలి.