విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పని సరి. అయితే మలేషియాకు వెళ్లాలంటే అలాంటిదేమీ అవసరం లేదని..ఆ దేశం ప్రకటించింది. దీంతో ఇకపై ఎటువంటి వీసాను తీసుకోకుండానే భారతీయులు మలేషియాకు వెళ్లి రావచ్చు. ఇంతకు ముందు వీసా ఉంటేనే ఆ దేశానికి వెళ్లే వీలుండేది. ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేస్తున్నట్టు మలేషియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకుని మలేషియాలో పర్యటించ వచ్చని తెలిపింది. నేపాల్, శ్రీలంక దేశాలకు వీసాల్లేకుండానే వెళ్లి రావచ్చు. ఇకపై మలేషియాకు కూడా అదే విధంగా వెళ్లేలా భారత పౌరులకు అవకాశం కల్పించింది ఆ దేశ సర్కారు.
మలేషియాకు వీసా అక్కర్లేదు
Related tags :