Kids

రాష్ట్రపతి నిలయం చూసొద్దాం రండి

Lets Visit Rashtrapati Bhavan In Delhi-Telugu Kids Fun Tours

సువిశాల స్థలం.. ఆహ్ల్లాదకరమైన వాతావారణం.. పచ్చిక బయళ్లు.. అందమైన గోపురాలు.. ఔషధ మొక్కలతో కొలువుదీరిన రాష్ట్రపతిభవన్ సందర్శకులకు ఆహ్వానం పలకనుంది. ఈనెల 2 నుంచి 17 వరకు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి పౌరులు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి, అక్కడి అందాలను తిలకించవచ్చు. పౌరులకు ప్రవేశం ఉచితం. వాటర్ బాటిళ్లు మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శకులకు అవకాశం కల్పిస్తున్నారు.
*అనావాయితీగా..
ఇటీవల శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఇక్కడి అందాలను, ప్రకృతి శోభితాన్ని ప్రజలు వీక్షించేందుకు మరోసారి అవకాశం కల్పించారు. ప్రతి ఏటా రాష్ట్రపతి నిలయాన్ని వేలసంఖ్యలో సామాన్యులు సందర్శిస్తుంటారు. పిల్లాపాపలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ను కలియదిరుగుతారు. భవనంలోని దర్బార్ హాల్, వంటగదులు, సమావేశ మందిరాలను తిలకించి పరవశించి పోతుంటారు.
*భవనం ప్రత్యేకత…
రాష్ట్రపతి నిలయాన్ని 76 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 గదులతో నిర్మించారు. దర్బార్‌హాలు, డైనింగ్ హాలు, సినీ మాహాలు, మార్నింగ్ రూమ్ ఇలా విశాలమైన గదులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటగది నుంచి భవనంలోకి వెళ్లేందుకు సొరంగ మార్గం ఉంది. ఇదే ప్రాంగణంలో సుమారు 150మంది సిబ్బంది నివాసానికి అనువైన క్వార్టర్స్ అందుబాటులో ఉన్నాయి.
*ఔషధ వనం
రాష్ట్రపతి భవన్‌లో 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఏర్పాటు చేశారు. ఔషధవనంలో 116 మొక్కలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ఐదెకరాల విస్తీర్ణంలో ఔషధ గుణాలు ఉన్న 116 రకాల మొక్కలతో ప్రత్యేక హెర్బల్ గార్డెన్‌ను అందంగా తీర్చిదిద్దారు. ఆయుర్వేదం, యూనానితోపాటు ఇతర ఔషధాలకు వినియోగించే మొక్కలను పార్కులో ఏర్పాటు చేశారు. ఇక్కడ నాటిన ప్రతి ఔషధ మొక్కలో ఒక్కొ గుణం దాగి ఉంది. శరీర రుగ్మతలను తొలగించేందుకు ఈ మొక్కలు దోహదపడుతాయని పలువురు సందర్శకులు తెలియజేస్తున్నారు.
*నక్షత్ర వాటిక…
రాష్ట్రపతి నిలయంలో నక్షత్ర వాటిక ప్రత్యేక ఆకర్షణగా సందర్శకులను కనువిందు చేయనుంది. 2013 డిసెంబర్‌లో ఈ వాటిక ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎకన్నర స్థలంలో వలయాకారంలో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. 27 రకాల నక్షత్రాలు, 9 గ్రహాల పేరుతో మొక్కలను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో 76 ఎకరాల స్థలంలో పార్కు విస్తరించి ఉంది. రాష్ట్రపతి డైనింగ్ రూమ్‌కు భోజనాన్ని తీసుకువెళ్లేందుకు ఉపయోగించే సోరంగంమార్గం మరో ప్రత్యేక ఆకర్షణ. దీని పొడవు 50 మీటర్లు. ఇప్పటికి ఈ మార్గంలోనే వంటశాల నుంచి రాష్ట్రపతికి భోజనం తీసుకువెళ్లుతుంటా రు. ఈ సోరంగమార్గం చుడముచ్చటగా ఉంటుంది.
*పూల తోటలు..ఊడల ఊయల..
పూల తోటలకు ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం 17 ఎకరాల్లో 35 రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో అరుదైన పూల మొక్కల అందాలు సందర్శకులను అలరిస్తాయి.ఈ భవనం వెనకాల కుడివైపు చెట్లకు వేలాడే ఊడలు పిల్లలకు ఉయ్యాలలూగేందుకు అనువుగా ఉంటాయి. వివరాలకు 040-27862513లో సంప్రదించవచ్చు.