* వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పింది. వివరాల్లోకెళ్తే.. తంగల్లపల్లి మండలం టెక్స్‌టైల్స్ పార్క్ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రవికి తీవ్ర గాయాలయ్యాయి.
*అవినీతి నిరోధక శాఖ (అనిశా) డీజీ కుమార్ విశ్వజీత్‌ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆయన స్థానంలో రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న పి.సీతారామాంజనేయులును నియమించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మరోవైపు రవాణశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
- తుళ్ళూరు మందడం గ్రామము సెక్షన్ 144 మరియు 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉన్నప్పటికీ సకల జనుల సమ్మెలో భాగంగా మందడం లో మహిళలు కొంత మంది బ్యాంక్ లను, స్కూళ్ళను, గవర్నమెంట్ ఆఫీసులను, షాపులను దౌర్జన్యం మరియు బలవంతముగా మూయించడానికి ప్రయత్నించుచుండగా అచ్చట విధులలో ఉన్న మహిళా పోలీసులు అడ్డుకోవడం తో మహిళలు రోడ్డు పై బైఠాయించి ట్రాఫిక్ ని దిగ్బంధం చేశారు, మహిళా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పై దుర్బాషలాడుతూ వారిని కించపరచి మాట్లాడుతూ , పోలీసు వాహానానికి అడ్డు పడి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, మహిళా పోలీసు పై దాడి చేసినారు, ఈ క్రమం లో మాహిళలకు సారద్యం వహించిన బెజవాడ నరేంద్ర, బెజవాడ సుప్రియ, బెజావాడ బ్రాహ్మణి, నూతక్కి జ్యోతి, వట్టికూటి శారద మరియు మరికొందరి పై 143,188,353 r/w 34 IPC కింద కేసులు నమోదు చేయడం జరిగినదని తెలిపారు.
- పోలీసుల పై ఫిర్యాదు చేసిన మందడం మహిళలు..
తమపై దౌర్జన్యం చేసి, ఇష్టానుసారంగా,కొట్టి తిట్టినట్లు ఫిర్యాదు
ఓ పోలీస్ సరిగా కూర్చోండి ముండల్లారా…అనడం చాలా దారుణమని వాపోయిన మహిళలు
తమని అసభ్య పదజాలంతో మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరిన మహిళలు
తమ బట్టలు చినిగిపోయేలా, వంటిపై గాట్లు పడేలా చేసారని ఫిర్యాదు
బస్సు తమ పై నుండి పోనివడ్డానికి కూడా వెనుకాడలేదని ఫిర్యాదులో పేర్కొన్న మహిళలు
ఏదో నేరం చేసిన వాళ్ళని…ఈడ్చుకెళ్లి నట్లు…ఈడ్చుకెళ్లారని ఫిర్యాదు
పోలీసుల తీరు చాలా దారుణంగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న మహిళలు
ఇద్దరు మహిళలని ,అసభ్యంగా తిట్టి,గొంతు పిసికినట్లు..ఫిర్యాదులో పేర్కొన్న మహిళలు(సుప్రియ,బ్రహ్మణీ)
* తుళ్లూరు మండలం దొండపాడు గ్రామం లో రైతు మృతి.నిన్నటి వరకు ఆందోళన లో పాల్గొన్న మల్లికార్జున్ రావు.రాజధాని నిర్మాణానికి10 ఎకరాల భూమి ఇచ్చిన రైతు.తెల్లవారు గుండె పోటు తో మృతి చెందిన మల్లికార్జున్ రావు.తుళ్లూరు నిరసన దీక్షల్లో రెండు నిమిషాలు మౌనం పాటించిన రైతులు
* తిన్నింటి వాసాలనే లెక్కబెట్టారు బ్యాంకు మేనేజర్లు. పనిచేస్తున్న ఆఫీసులోనే కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఓ ప్రైవేట్ సంస్థతో కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి రూ.16 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్ మహబూబ్గంజ్ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో జరిగింది.
* శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
* గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చోటుచేసుకుంది. శేఖర్ అనే వ్యక్తి తన ఇంటిస్థలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. క్షుద్రపూజలు చేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశాడు. క్షుద్రపూజలు కలకలం రేపడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు శేఖర్‌ను అరెస్ట్ చేశారు.
* వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్ చేశారు.
* ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ రోడ్డు దాటేందుకు యత్నించడంతో ఒకరిని కారు ఢీకొట్టింది. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
* అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది.
* నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలోని గుముండల గ్రామ బాలిక హత్య సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు బాగా వినిపించాయి.
* దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి బ్రిడ్జి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. గల్లంతు అయిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా సింహాచలం దేవస్థానం నుంచి తిరుగు ప్రయాణంలో బరంపురం (ఒడిశా) వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
*కిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నన్‌కానా సాహెబ్ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది.
*శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
*ఇరాక్‌లో రెండోరోజూ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్‌పై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. ‘హషీద్ అల్ షాబీ’ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు.
*తండ్రి మందలించాడని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని రామనర్సయ్యనగర్లో శుక్రవారం చోటు చేసుకుంది.
*మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్న ఓ వృద్ధురాలు దారిలోనే మృతి చెందడంతో ఆమె బంధువులు హతాశులయ్యారు. వైద్య సిబ్బంది ఖాళీ ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడమే ఆమె మృతికి కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మార్చెట్టి లక్ష్మి (65) శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించారు
*బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న బంజారాహిల్స్కి చెందిన ఇంరోజ్ బాషా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు తన స్నేహితునితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు.
*ఈ కామర్స్లో మరో మోసాన్ని సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. బిహార్లోని కబీర్పూర్కి చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ కామర్స్ నుంచి డేటాను సేకరించి బహుమతుల పేరుతో వినియోగదారులకు గాలం వేస్తోంది. ఈ కామర్స్లోని డేటా లేకేజీపై దృష్టిపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు బిహార్ ముఠా అక్రమాలను గుర్తించారు.
*బహుమతుల పేరుతో ఎస్సెమ్మెస్, టోల్ఫ్రీం ఫోన్ నంబర్ల ద్వారా ఆన్లైన్ వినియోగదారులకు గాలం వేసి భారీ మొత్తంలో సొత్తు కాజేస్తున్న నలుగు బిహార్ ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
*యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వరుస హత్యాచారకేసులతో తనకెలాంటి సంబంధం లేదని…కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్రెడ్డి న్యాయస్థానానికి మరోసారి వెల్లడించాడు.
*అనుమానంతో భార్య, కుమార్తెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో ఆ మంటలు అంటుకొని భర్త సైతం కాలిపోయిన ఘటనలో.. భార్య వరలక్ష్మి (38) శుక్రవారం మృతిచెందింది.
*టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడుపుతూ గొర్రెల మందను ఢీకొట్టడంతో 120 మృతిచెందగా మరో 130 జీవాలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలోని జాతీయ రహదారి 365పై గురువారం రాత్రి చోటుచేసుకుంది.
*రాజధాని నగరంలోని చందానగర్ ఠాణా పరిధిలో భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ.60 లక్షలకుపైగా విలువైన సిగరెట్ డబ్బాల కార్టన్లను దొంగలు ఎత్తుకెళ్లారు.
* నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలోని గుముండల గ్రామ బాలిక హత్య సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు బాగా వినిపించాయి.
* కోతులు పంటను దెబ్బతీస్తున్నాయన్న కోపంతో ఓ రైతు దారుణానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండపంలోని కంగొందికి చెందిన ఓ రైతు అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో పురుగుల మందు కలిపి పొలంలో చల్లాడు, ఆ ఆహారాన్ని తిని 50కి పైగా కోతులు చనిపోయాయి. మందు కలిపిన ఆహారాన్ని తిన్న కోతులు అరగంటలోనే చనిపోయాయి. పొలమంతటా కోతుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. స్థానికులు కొన్నింటిని పూడ్చిపెట్టారు. మూగజీవాలను విషం పెట్టి చంపడంపై ప్థానికులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు