ఆ కోరిక తీరలేదంటోంది నటి ప్రియమణి. తమిళ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముత్తళగి(పరుత్తివీరన్ చిత్రంలోని పాత్ర) ఈ భామ. కేరళా చిన్నది తమిళం, తెలుగు భాషల్లోనూ కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పరుత్తివీరన్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న ప్రియమణి వివాహానంతరం నటనకు దూరమైంది. సినిమాలకు దూరం అయినా, బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఇటీవల వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో వెండితెరకూ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇలా రియాలటీ షోలు, వెబ్ సిరీస్, సినిమాలు అంటూ మళ్లీ బిజీ అయిపోయింది. తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన అసురన్ చిత్ర తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ సరసన నటించే అవకాశం ప్రియమణినే వరించింది. ఈ సందర్భంగా ఈమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటిగా పరిచయమై 17 ఏళ్లు అయిందని చెప్పింది.
రీమేక్‌తో రిటర్న్
Related tags :