Movies

వేర్వేరుగా చూడలేను

Rashmika On Hit And Flop Movies

నాకు అవకాశాలు ముఖ్యంకాదు అని చెప్పుకొచ్చింది నటి రష్మిక. టాలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్‌ను సంపాధించుకున్న కన్నడ నటి ఈ బ్యూటీ. తొలి రోజుల్లోనే ప్రేమలో ఓలలాడడం, విడిపోవడం వంటి వాటితో వార్తల్లోకి ఎక్కిన రష్మిక ఇప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. నిజానికి తెలుగులో ఈ అమ్మడు నటించిన నాలుగే చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో ఛలో చిన్న చిత్రంగా విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆ తరువాత నటించిన గీతాగోవిందం చిత్రమే రష్కిక కేరీర్‌ను పెద్ద మలుపు తిప్పింది. ఆ తరువాత నటించిన డియర్‌ కామ్రేడ్, దేవదాస్‌ చిత్రాలు యావరేజ్‌గానే ఆడాయి. అయినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తమిళంలో డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆడక పోయినా రష్మికకు ఇక్కడ కార్తీతో సుల్తాన్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ వరించింది. ఈ చిత్రం కనుక హిట్‌ అయితే కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి పట్ట పగ్గాలుండవు. కాగా ఇటీవల నటి రష్మిక ఒక భేటీలో పేర్కొంటూ విజయం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుందన్నారు. అలాగని హిట్‌ అయిన చిత్రాలను, ప్లాప్‌ అయిన చిత్రాలను తాను వేర్వేరుగా చూడనని చెప్పింది.