Movies

నటించక తప్పదు

Sriya Saran Still Looking For Opportunities

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రియ ఒకరు. ఈమె ప్రస్తుతం సినీ అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్నారు. అయితే, తనకు వచ్చిన ఒకటి అర చిత్రాలను మిస్ చేసుకోకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ళ క్రితం రహస్యంగా వివాహాన్ని చేసుకున్నారు. వరుడు రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. పైగా వ్యాపారవేత్త. పేరుత అండ్రీ కోశీవ్‌. ఈ సీక్రెట్ వివాహంపై ఇంతవరకు శ్రియ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. పెళ్లి విషయంలో దాయడానికి ఏమీ లేదని, అయితే తన జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. నటనను కొనసాగిస్తానని, ఈ విషయంలో తన భర్త సహకారం ఉందని పేర్కొంది. తాను బిజీగా ఉంటేనే ఆయన ఆనందిస్తుంటారని తెలిపింది. తన పెళ్లై దాదాపు రెండేళ్లు అవుతున్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని శ్రియ నవ్వుతూ చెప్పింది.