DailyDose

బుధవారం బ్యాంక్‌‌లు బంద్-వాణిజ్యం

Wednesday Is Banks Bandh-Telugu Business News Roundup Daily Today

* నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌‌లు బంద్ చేపడుతున్నాయి. వచ్చే వారం కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్‌‌ ఇండియా జనరల్ స్ట్రయిక్‌‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి. ఈ నెల 8న(బుధవారం) డ్యూటీలకు రావొద్దని ఆల్‌‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌‌ఐ) వంటి బ్యాంక్‌‌ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. దీంతో బుధవారం బ్రాంచ్‌‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి.
* చైనా స్మార్ట్‌ ఫోన్‌ మేకర్‌ వివో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మిడ్-బడ్జెట్ రేంజ్‌లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో విడుదల చేసింది. ఎస్‌ సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ రూ. 19,990 ధర వద్ద నేటి (శనివారం) నుంచి వివోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా అన్ని ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంచింది.
* మొబైల్స్‌ తయారీ దారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎస్‌1 ప్రొను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో.. 6.38 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.19,990 ధరకు ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.
* అమెరికా వైమానిక దాడుల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు నాలుగు శాతం వరకు పెరిగాయి. ట్రంప్‌ ఆదేశాల మేరకు ఇరాక్‌లో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారితో సహా మరికొంత మంది అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా అతిపెద్ద చమురు సరఫరాదారులైన ఈ రెండు దేశాలపై ఈ దాడి ప్రభావం పడటంతో ముడి చమురు ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. శుక్రవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు ధర 4.4 శాతం పెరిగి బ్యారల్‌ 69.16 డాలర్లను చేరుకోగా, వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్య్లూటీఐ) ముడిచమురు వెల 4.3 శాతం పెరిగి 63.84 డాలర్లను చేరుకుంది.
*డాలర్ మారకంలో రూపాయి విలువ మరింతగా క్షీణించింది. శుక్రవారంనాడు డాలర్ మారకంలో రూపాయి 42 పైసలు తగ్గి 71.80 వద్ద ముగిసింది.
*కియా మోటార్స్ తన సెల్టోస్ కార్ల ధరలను పెంచింది. ఈ నెల 1 నుంచి అన్ని వేరియెంట్లపై రూ.35,000 వరకు ధరలను పెంచినట్లు ప్రకటించింది. ప్రస్తుతం సెల్టోస్ ధర రూ.9.89 లక్షల నుంచి రూ.16.29 లక్షల మధ్యలో ఉంది. కాగా కియా కార్ల ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ విదేశాల్లో లక్ష కార్ల వరకు బుకింగ్స్ అయ్యాయని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
*హైదరాబాద్, అహ్మదాబాద్ల మధ్య విమాన సర్వీ్సను స్పైస్జెట్ ప్రారంభించనుంది. ఈ సర్వీస్ ప్రతి రోజూ ఉంటుంది. విమానం హైదరాబాద్లో సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరి 5.45 గంటలకు అహ్మదాబాద్ చేరుతుంది. అహ్మదాబాద్లో ఉదయం 8.40 గంటలకు బయలుదేరి 10.25 గంటలకు హైదరాబాద్ చేరుతుందని స్పైస్జెట్ తెలిపింది. హైదరాబాద్ నుంచి విమాన సర్వీస్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. బెంగళూరు-విజయవాడల మధ్య సర్వీసులను కూడా పెంచింది. మంగళవారం మినహా ఈ రెండు నగరాల మధ్య స్పైస్జెట్ సర్వీస్ ఉంటుంది.
*డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ్సలో డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ విలీనానికి వాటాదారులు ఆమోదం తెలిపారు. విలీన పథకానికి 99.98 శాతం ఓట్లతో ఆమోదం లభించిందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ ఆదేశాల మేరకు జనవరి 2న వాటాదారుల సమావేశం ఏర్పాటు చేసి విలీన ప్రక్రియకు కంపెనీ ఆమోదం పొందిం ది. 2019 జులైలో డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ విలీనానికి డాక్టర్ రెడ్డీస్ ఆమోదం తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్లో ప్రమోటర్ల గ్రూప్నకు 24.88 శాతం వాటా ఉంది. షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ సరళీకరణకు ఈ విలీనం దోహదం చేస్తుంది.
*లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన షాపర్స్ స్టాప్.. సిరిసిల్లలోని అపెరల్ పార్కులో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారంనాడు ముంబైలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, షాపర్స్ స్టాప్ ఎండీ రాజీవ్ సూరి అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
*నౌకల్లో వినియోగించే ఇంధనంలో సల్ఫర్ 0.5 శాతం మాత్రమే ఉండాలన్న ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాలను ప్రారంభించినట్లు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ప్రకటించింది