పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ సీనియర్ నేతలు పొన్నాల, వీహెచ్, దామోదర రాజనర్సింహులు ఆయన్ను కలిసి మాట్లాడారు. కమిటీల నియామకంలో ఎవర్నీ సంప్రదించడం లేదని, తమను అవమానాలకు గురి చేస్తున్నారని చెప్పారు. ఒక వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీసీలు, ఎస్సీలు పార్టీకి దూరమవుతున్నారని చెబుతూ.. రాష్ట్ర కాంగ్రెస్‌ను ప్రక్షాలన చేయాలని కోరారు. పార్టీలో 40 శాతం మంది కేసీఆర్ కోవర్టులున్నారని ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు.
కోవర్టుల కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
Related tags :