Fashion

వేణ్నీళ్లు…ఉప్పు…నిమ్మరసం

Foot protection tips for women-fashion and lifestyle tips

వెడల్పాటి బేసిన్‌లో… వేడినీరు, ఉప్పు, నిమ్మకాయరసం వేసి, అందులో పాదాలను అరగంటసేపు ఉంచి, బ్రష్‌తో రుద్దాలి. ఇలా తరచు చేస్తుండ్రం వల్ల కాలి పగుళ్లు పూర్తిగా పోతాయి.
♦ కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని వేసి చిక్కగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలరోజుల పాటు ఇలా చేస్తే పాదాల పగుళ్లు మాయమైపోతాయి. ఎండ వల్ల ఏర్పడిన నలుపూ పోతుంది.
♦ పగుళ్లు ఉన్న చోట మెత్తగా రుబ్బిన గోరింటాకు పెట్టి, ఎండాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే క్రమంగా పగుళ్లు తగ్గుముఖం పడతాయి.