అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధానిరైతులు ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అమరావతి రైతులు సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని వేడుకున్నారు. మహిళా రైతులు భావోద్వేగానికి గురై .. తమను కాపాడాలంటూ కిషన్‌రెడ్డి కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు. న్యాయం చేస్తానని కిషన్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పారు.
కిషన్‌రెడ్డి కాళ్లు పట్టుకున్న మహిళా రైతు
Related tags :