Movies

కళ్యాణ్‌రామ్ దూకుడు

Nandamuri Kalyan Ram Locking Horns With Big Heads

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఎంత మంచివాడ‌వురా’ చిత్రం సంక్రాంతికి  బాక్సాఫీస్ బరిలోకి దిగనుంది. సూపర్ స్టార్లు రజినీకాంత్, మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాలకు పోటీగా తొలిసారి కళ్యాణ్ రామ్ తన సినిమాని సంక్రాంతికి కానకగా జనవరి 15న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రజినీ కాంత్, మహేష్, బన్నీ తమ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో క‌ళ్యాణ్ రామ్ కూడా తన సినిమా ప్రమోషన్స్ ప్రారంభించాడు. కాగా, ‘ఎంత మంచివాడ‌వురా’ చిత్రానికి మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు తన సోదరడు ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతున్నాడు క‌ళ్యాణ్ రామ్. జ‌న‌వ‌రి 8న జెఆర్‌సి క‌న్వెష‌న్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ ఆహ్వానించాడు. ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెహరీన్ క‌థానాయికగా నటిస్తుంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా సతీష్ ఈ మూవీని తెరకెక్కించారు.