Kids

శాస్త్రవేత్త బార్బీ

Scientist Barbie Released Into Market

ఆడపిల్లల్లో సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల పట్ల ఆసక్తిని కలిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓ అమ్మ తయారుచేసిన బొమ్మే ఈ సైంటిస్ట్‌ బార్బీ..ఉతాహ్‌ విశ్వవిద్యాలయంలో అటవీ పర్యావరణ శాస్త్రవేత్తగా ఉన్న నళిని తన కూతురు బార్బీబొమ్మను అడగడంతో కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. శాస్త్రవేత్తగా ఎందరో విద్యార్థులకు ప్రకృతిపై అవగాహన, పర్యావరణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే నళిని, చిన్నారుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేదిశగా శాస్త్రవేత్త బార్బీని తయారుచేసింది. దానికి ట్రీ టాప్‌ బార్బీ’గా నామకరణం చేసింది. చిన్నారుల్లో సైన్స్‌ పట్ల అవగాహన రావాలన్నా, ఆసక్తి పెరగాలన్నా… చిన్నప్పటి నుంచి ఇలాంటి బొమ్మల గురించి తెలిసుండాలని అంటోంది నళిని.