నడుము నొప్పితో బాధపడుతూ ఏ పనీ చేయలేకపోతున్నారా? అయితే ఈ ముద్ర మీకోసమే! కుడిచేతి మధ్యవేలు, చిటికెన వేలు చివర్లు కలిపి ఉంచాలి. ఉంగరం వేలు, చూపుడు వేలు నిటారుగా ఉంచాలి. ఎడమ చేతి చూపుడు వేలు మడిచి దానిమీద బొటనవేలిని ఉంచాలి. మిగతా మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రని కళ్లు మూసుకుని వెన్నెముక నిటారుగా ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టి చేయాలి. ఈ ముద్రని అయిదు నుంచి పది నిమిషాలు చేయొచ్చు. నొప్పి ఎక్కువగా ఉంటే రోజులో ఎక్కువసార్లు చేయాలి.
నడుము నొప్పి నివారించే యోగాసనం
Related tags :