చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా పుత్తూరు మండలం కేబీఆర్ పురం వైకాపా నాయకులు అడ్డుకున్నారు. సొంతపార్టీ నాయకులకు కాకుండా తెదేపా వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ శంకుస్థాపనకు వచ్చిన రోజాను ఈమేరకు వైకాపా నాయకులు నిలదీశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని గ్రామస్థులకు సర్దిచెప్పారు.
రోజాకు నిరసన సెగ
Related tags :