సంక్రాంతికి నారావారిపల్లె వెళ్లే కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనే నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ ఏడాది మాత్ర వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
అమరావతి రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతిలోనే ఉండి రైతులకు సంఘీభావం ప్రకటించాలని బాబు నిర్ణయించారు.
అయితే.. సంక్రాంతి సమయంలో నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబసభ్యులు పర్యటించే అవకాశం ఉంది.