యాపిల్ బ్రాండ్ ఎందుకు అంత పైకి వచ్చిందీ అంటే – ఐఫోన్ కీ యాపిల్‌కీ మాత్రమే ప్రత్యేకమైన ఫీచర్స్ అని చెప్పవచ్చు. ఐట్యూన్స్, ఫేస్ టైమ్ లాంటివి యాపిల్‌కే ప్రత్యేకమైన ఫీచర్స్. వీటికి సమాంతరంగా, సమానంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా కొన్ని ఆల్టర్నేట్స్ మనకి లభిస్తాయి కానీ అంత సంతృప్తినివ్వవు. ముఖ్యంగా ఐఫోన్లూ, మ్యాక్ కంప్యూటర్లు, ఐప్యాడ్స్ – వీటన్నిటి మధ్యా ఫైల్స్‌ని సులువుగా వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం వాడే ఎయిర్ డ్రాప్ టెక్నాలజీ యాపిల్‌కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ఇది కూడా బ్లూ టూత్ బేస్డ్ టెక్నాలజీ అయినప్పటికీ ఫైల్ ట్రాన్స్‌ఫర్‌కి ఉపయోగపడే ఒక అత్యంత సహజమైన సులువైన పద్ధతిగా గుర్తింపు పొందింది. యాండ్రాయిడ్ ఫోన్స్‌లో కూడా షేరిట్ లాంటివి వాడతాం గానీ… ఎయిర్‌డ్రాప్ లాంటి సులువు వీటిలో మనకి కనిపించదు. యాపిల్ అయితే ఒకటే బ్రాండ్ కాబట్టి – వాటన్నిటి మధ్యా ఓ కంపాటిబిలిటీ ఉంటుంది. కానీ యాండ్రాయిడ్‌లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. వాటన్నటి మధ్యా వైర్‌లెస్ ట్రాన్స్‌ఫర్ ఇంత సహజంగా జరగాలంటే ఎలా? ఎయిర్ డ్రాప్ లాంటి సులువైన, ఫీలింగ్ కలిగించే సౌకర్యవంతమైన ఓ ఉమ్మడి ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ కావాలి. అందుకే – ప్రసిద్ధ చైనీస్ ఫోన్ కంపెనీలు మూడు- షియామీ ఒప్పో వివో కలిసి – యాపిల్ ఎయిర్ డ్రాప్ మాదిరిగా యాండ్రాయిడ్ ఫోన్స్ లో – ఒక ఉమ్మడి వైర్లెస్ టెక్నాలజీని రూపొందించేందుకు నడుం కట్టాయి. ఈ వైర్‌లెస్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ అనేది బ్రాండ్స్‌కి అతీతంగా పనిచేస్తుందట. చూద్దాం! ఈ టెక్నాలజీ ఎయిర్ డ్రాప్‌కి ఎంతవరకూ పోటీగా ఉండబోతుందో!
AirDrop డూప్ తయారీలో చైనా కంపెనీలు
Related tags :