తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో నిబంధనలు పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొన్ని అంశాలను లేవనెత్తారు. తొలుత రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించాలని.. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిబంధనలేమీ పాటించలేదని న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సదరు నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, సవరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు.
తెలంగాణా మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
Related tags :