దేశంలోని యువత గొంతును ప్రభుత్వం నొక్కి వేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
ఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థులపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే.
ఆ ఘటనపై సోనియా స్పందిస్తూ.. దేశ యువతపై గూండాలు దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
మోదీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని, ఇది అమోదయోగ్యం కాదన్నారు.
నిరసన గళాలను ప్రభుత్వం నొక్కి వేస్తున్నదని చెప్పడానికి జేఎన్‌యూ ఘటనే ఉదాహరణ అని సోనియా అన్నారు.