‘ఎవరు’తో గతేడాది రెజీనా ఓ విజయం అందుకున్నారు. తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘అ!’ మినహాయిస్తే… గడచిన నాలుగేళ్లలో ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న సమయంలో ‘ఎవరు’ ఊపిరి ఇచ్చింది. ఇప్పుడు ఆమెకు తెలుగులో మరో అవకాశం వచ్చింది. రెజీనా టైటిల్ పాత్రలో మహిళా ప్రాధాన్య చిత్రం ఒకటి తెరకెక్కుతోంది. సినిమా పేరు ‘కైవల్య’. నేహాప్రకాశ్ నాయుడు దర్శకత్వంలో అభిషేక్ జవాకర్ నిర్మిస్తున్నారు. ‘కైవల్య’ ఎవరు? ఆమె కథేంటి? అనేది గోప్యంగా ఉంచారు. చాలా సైలెంట్గా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చిత్రీకరణ ప్రారంభమైందని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీత దర్శకుడు. ఛోటా కె. నాయుడు ఛాయాగ్రాహకుడు.
సైలెంట్ షూటింగ్
Related tags :