Movies

దాస్ దాసీ

Shraddha Das As Prostitute Role

‘వేదం’లో అనుష్క, ‘జ్యోతిలక్ష్మి’లో ఛార్మి వేశ్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతకు ముందు… ఆ తర్వాత కూడా తెలుగు తెరపై వేశ్యలుగా నటించిన కథానాయికలు కొందరు ఉన్నారు. ఈ జాబితాలో శ్రద్ధా దాస్ కూడా చేరుతున్నారు. జగపతిబాబు ప్రధాన పాత్రలో నృత్య దర్శకుడి నుండి దర్శకుడిగా మారిన విద్యాసాగర్ ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా దాస్ వేశ్య పాత్రలో కనిపించనున్నారు.ఇంతకు ముందు లఘు చిత్రాలు ‘శృంగారదాం’, ‘ప్యూర్ సోల్’లో ఆమె వేశ్యగా కనిపించారు. 2017లో విడుదలైన ‘పిఎ్సవి గరుడవేగ’ తర్వాత శ్రద్ధా దాస్ నటిస్తున్న చిత్రమిది. కథ విషయానికి వస్తే… జగపతిబాబు కండోమ్స్ తయారు చేసే కంపెనీ అధిపతిగా కనిపించనున్నారు. వేశ్యలతో మాత్రమే తన కంపెనీకి సంబంధించిన ప్రకటనలు రూపొందించే ఆయన… ఓ వేశ్యతో ప్రేమలో పడతారు. ఆమె శ్రద్ధా దాస్! వీరిద్దరి ప్రేమకథ ఏంటనేది తెరపై చూడాలి. శ్రద్ధా దాస్ పాత్ర చాలా ఎమోషనల్గా సాగుతుందట! వేశ్యగా భారతీయ వస్త్రాధరణలో ఆమె కనిపిస్తారట!