*అమరావతి రాజధాని కోసం పోరు బాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. నిన్న భారీ పాదయాత్రతో హోరెత్తించిన రైతులు, మహిళలు ఇవాళ చినకాకాని వద్ద జాతీయరహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. అమరావతి ఐకాస పిలుపుమేరకు జాతీయ రహదారిపై బైఠాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి హాయ్‌ల్యాండ్, గుంటూరుకు తరలించారు. రైతులు హాయ్‌ల్యాండ్‌లో ఎండలోనే కూర్చుని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చినకాకాని వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులను పక్కకు లాగి మంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
* గొల్లపూడి దేవినేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన దేవినేని ఉమా ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు.
*రహదారుల దిగ్బంధం పేరుతో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. కొన్ని వర్గాలవారు ఉద్దేశపూర్వకంగా రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు
*రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రైతుల ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. సీఎం సచివాలయానికి వస్తున్నారంటూ మందడంలో మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.
* వైఎస్‌ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్లదాడిలో పిన్నెల్లి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పిన్నెల్లి గన్‌మెన్‌లపై ఆందోళనకారులు పిడిగుద్దులు కురిపించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆందోళనకారులు ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అరగంట తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చినకాకాని నుంచి పిన్నెల్లిని సురక్షితంగా తీసుకెళ్లారు.
* అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయల్దేరిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు లోకేశ్‌తో పాటు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన దీక్షలో పాల్గొని లోకేశ్ తిరిగి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అవనిగడ్డ- విజయవాడ కరకట్ట రహదారి మీదుగా తెదేపా నేతలను తీసుకెళ్లారు. తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌కు లోకేశ్‌ను తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
* రాజధాని మార్చి మమ్మల్ని క్షోభ పెట్టొద్దు’
రాష్ట్ర ప్రభుత్వ రాజధాని మార్పు ప్రతిపాదనతో అమరావతి అట్టుడుకుతోంది. గత కొన్ని రోజులుగా ధర్నాలు, దీక్షలు, కవాతులు, ముట్టడులు.. ఇలా రోజుకో పోరాట రూపంలో రాజధాని ప్రాంత ప్రజలు కదం తొక్కుతున్నారు. మహిళలు సైతం ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అని నినదిస్తూ రోడ్డెక్కారు. రాజధాని మార్పు అంశంపై రైతులే కాదు.. సచివాలయ ఉద్యోగులూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని విశాఖకు మారిస్తే అమరావతి రైతులతో పాటు తమకూ ఇబ్బందేనని వాపోతున్నారు. రాజధాని అనేది రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో.. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగాలి తప్ప ఎవరి రాజధాని వాళ్లు పెట్టుకొని నచ్చినట్టు మార్చుకుంటూ పోతామంటే అంతిమంగా ఇబ్బందులకు గురయ్యేది తామేనంటూ ఆవేదన చెందుతున్నారు.
* రాజధాని కోసం పోరు బాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. నిన్న భారీ పాదయాత్రతో హోరెత్తించిన రైతులు, మహిళలు ఇవాళ చినకాకాని వద్ద జాతీయరహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. అమరావతి ఐకాస పిలుపుమేరకు జాతీయ రహదారిపై బైఠాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి హాయ్‌ల్యాండ్, గుంటూరుకు తరలించారు. రైతులు హాయ్‌ల్యాండ్‌లో ఎండలోనే కూర్చుని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చినకాకాని వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులను పక్కకు లాగి మంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. చినకాకాని చేరుకుని హైవేపై బైఠాయించిన తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి గుంటూరు తరలించారు. ఆందోళనలో పాల్గొనే రైతులకోసం సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగి రణరంగంలా మారింది
* తన కాన్వాయ్‌పై దాడి కుట్రలో భాగమేనని, రైతుల ముసుగులో తనపై దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానన్నారు. తన గన్‌మెన్‌ను కొట్టి.. కారుపై రాళ్ల దాడి చేశారన్నారు. దాడులకు చంద్రబాబు ఉసిగొల్పుతున్నారని పిన్నెల్లి ఆరోపించారు. దాడులు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని చినకాకాని హైవేపై రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారును చుట్టుముట్టి నినాదాలు చేశారు. అయితే ఎమ్మెల్యే కారును ఆపకుండా ముందుకెళ్లడంతో కొందరు రైతులు రాళ్లతో దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రైతులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
* రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనే: సోమిరెడ్డి
రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనేనని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే.. ఏదో జరిగినట్లు పిన్నెల్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది భవిష్యత్‌ను కమిటీ 5 రోజుల్లో తేల్చేస్తుందా?, జగన్ తలకిందులుగా తపస్సు చేసినా రాజధానిని మార్చలేరు?, ప్రధాని శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చాక నువ్వేంటి మార్చేది?, కేంద్రం చూస్తూ ఊరుకోదని తెలిపారు.
* భుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణ కామెంట్స్
రాజధాని రైతుల ముసుగులో దాడులు చేయటం సరికాదురైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడి చేస్తున్నారు.నా కారుపై దాడి చేస్తే రైతుల సమస్యలు పరిష్కారం కావు…దాడి చేసింది రైతులు కాదు టీడీపి నాయకులురాజధాని రైతులు ఎవ్వరు చంద్రబాబు మాయలో పడొద్దుదాడి వెనక చంద్రబాబు హస్తం ఉంది..ఏ సమస్య అయినా ద్వారా పరిష్కారం అవుతాయ్చంద్రబాబు కుట్రలు ఫలించవుకర్రలు, రాళ్లు, తీసుకుని దాడి చేసింది రైతులు కాదు…ఇలాంటి దాడులకు భయపడేది లేదు
* అరెస్టులతో ఆందోళనలను అణచివేయలేరు
అమరావతి నుంచి రాజధానిని అప్రజాస్వామిక రీతిలో తరలిస్తుంటే రైతాంగం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తోంది. వారికి బాసటగా నిలిచిన జనసేన నాయకులను పోలీసు యంత్రాంగం గృహ నిర్భందాలు చేసి, అరెస్టులు చేసి శ్రేణులను భయభ్రాంతులకు లోను చేయాలని చూస్తున్నారు. ఈ రోజు రైతులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భందనానికి మద్దతు పలికిన జనసేనపై పోలీసులు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ను తెల్లవారుజామునే పోలీసులు వెళ్లి కారణం చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాయకులను నిర్బంధించడం ద్వారా రైతులను, మా పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారా? అరెస్టులతో ఆందోళనలు అణచివేయలేరని ప్రభుత్వం గ్రహించాలి. ప్రశ్నించే పార్టీ మాది. ధర్మం వైపు నిలుస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులను నిర్భంధించడాన్ని తప్పుబడుతున్నాం. మా నాయకులను, రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
* కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాజధాని రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమానికి వెళ్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. లోకేశ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రహదారిపై టైర్లు వేసి తగులబెట్టారు. సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నిస్తుండగా వైకాపాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగంలోకి దిగి వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడికి కాసేపటికే లోకేశ్ సహా తెదేపా నేతలను పోలీసులు విడుదల చేశారు.
అమరావతి కోసం రణరంగం-వార్తా విశేషాలు
Related tags :