Movies

మలేషియా దెబ్బకు “దర్బార్” బంద్

Madras High Court Blocks Durbar Release In Malaysia

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘దర్బార్ ’ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఇంతలో ఈ సంస్థకు షాక్ తగిలింది. ‘దర్బార్’ మూవీని నిలిపివేయాలంటూ మలేషియాకు చెందిన డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థకు లైకా ప్రొడక్షన్ సంస్థ రూ.23 కోట్లు బకాయిలు చెల్లించాలని, ‘రోబో 2.0’, ‘దర్బార్’ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు ‘దర్బార్’ సినిమా విడుదల కావాలంటే డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థకు లైకా ప్రొడక్షన్స్ రూ. 4.90 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.కాగా ఈ మూవీని దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రజినీ సరసన నయనతార నటిస్తున్నారు.