“సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్” పేరుతో అమెరికాలోని ఫిలడెల్ఫియా ఎన్నారైలు సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అధికార వికేంద్రీకరణ కాదు అని సమావేశానికి హాజరయిన 200మందికి పైగా ప్రవాసాంధ్రులు నినదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న రాజధాని మార్పు ప్రకటనల వలన ప్రవాసాంధ్రుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని తెలంగాణ విడిపోయి హైదరాబాద్ కోల్పోయి తీవ్రంగా నష్టపోయి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కుదుటపడుతున్న సమయంలో వేలాది రైతుల త్యాగాల ఫలితం, కోట్లాది ప్రజల ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి ప్రవాసాంధ్రులు విజ్ఞప్తి చేశారు.
ఫిలడెల్ఫియాలో “సేవ్ అమరావతి” కార్యక్రమం

Related tags :