శ్రీశైలంలో 12 నుంచి బ్రహ్మోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు – 07/01
సంక్రాంతి రోజున కల్యాణం మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12 నుంచి 18వ తేది వరకు జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎ్స. రామరావు తెలిపారు. సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో అధికారులతో, మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాహ్నికదీక్షతో ఈ నెల 12 నుంచి ఏడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదిన ముగుస్తాయన్నారు. మల్లికార్జున స్వామివారికి ఏటా మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాల వివరాలు : ఈ నెల 12న ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశ కార్యక్రమం, వేదపండితుల చతుర్వేద పఠనంతో వేదస్వస్తి నిర్వహిస్తారు. తరువాత లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పం పఠిస్తారు. స్థలశుద్ధి కోసం స్వస్తి పుణ్యహవాచనాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ నిర్వహణకు చండీశ్వరునికి విశేష పూజలు జరిపిస్తారు. అనంతరం కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపనల తరువాత ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 12 నుంచి 18వ తేది వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామి అమ్మవార్లకు విశేషపూజలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, నిత్యహవనాలు జరిపిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 13వ తేది నుంచి స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు. 15వ తేది మకరసంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం గంగా, పార్వతీ సమేత మల్లికార్జునస్వామివార్లకు లీలా కల్యాణ మహోత్సవం, 17వ తేది ఉదయం రుద్రయాగం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, సాయంత్రం ధ్వజావరోహణ, సదస్యం, నాగవల్లి నిర్వహిస్తారు. 18న స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ జరుగుతాయి
2.13 నుంచి సుప్రీంలో శబరిమల వాదనలు
శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 13 నుంచి వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ నెల 13 నుంచి వాదనలు విననున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులో పేర్కొంది. శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపైనా విచారణ జరపనుంది.
3.ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.1.10 కోట్ల విరాళం
తితిదే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన దాత రూ.1,10,11,111లు విరాళంగా అందించారు. సోమవారం సాయంత్రం పుంగనూరు అమరనాథ్ చౌదరి, దీప్తి దంపతులు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళం మొత్తాన్ని డీడీ రూపంలో అందజేశారు. దాత మాట్లాడుతూ.. తితిదే గోసంరక్షణకు చేస్తున్న సేవలకు ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.
4.కమనీయం… రంగుల మహోత్సవం
శ్రీతిరుపతమ్మ, గోపయ్యస్వాములురెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం మళ్లీ వస్తోంది. పెనుగంచిప్రోలు నుంచి మొదలయ్యే ఉత్సవం పలు గ్రామాల మీదుగా సాగుతూ తిరిగి పెనుగంచిప్రోలు చేరుకుంటుంది. తిరుపతమ్మ అమ్మవారు పరివార దేవతామూర్తులతో బయలుదేరింది మొదలు తిరిగి ఆలయానికి చేరుకొనేంత వరకు గ్రామదేవత సంప్రదాయం ఉట్టి పడుతుంది.తిరుపతమ్మ, గోపయ్యస్వామి, ఆలయంలో అమ్మవారికి పరివారంగా ఉన్న సహదేవతలు ఉన్నవూరు అంకమ్మ, వినుకొండ అంకమ్మ, చంద్రమ్మ, మల్లయ్య, పెద్దమ్మ అమ్మవారు, మద్దిరావమ్మ, గుర్రం విగ్రహాలతో పాటు తిరుపతమ్మ, గోపయ్య ఉత్సవ మూర్తులు మొత్తంగా 11 విగ్రహాలను జగ్గయ్యపేట తరలిస్తారు. అక్కడ 26 రోజుల పాటు విగ్రహాలకు రంగుల ఉత్సవం జరగనుంది. తిరిగి పెనుగంచిప్రోలుకు తరలివచ్చే కార్యక్రమం అత్యంత రమణీయంగా సాగనుంది. అమ్మవారి పరివారంలో శక్తిస్వరూపిణి అంకమ్మతల్లికి భక్తులు మొక్కులు సమర్పిస్తారు.
*ఇదీ నేపథ్యం :
ఆలయంలో విగ్రహాలన్నీ చెక్కతో చేసినవే. ప్రతి రెండేళ్లకు ఒకసారి వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, అందంగా రంగులు అద్దుతారు. జగ్గయ్యపేటలో నకాశీ వంశీయులు విగ్రహాలకు రంగులు వేసే క్రతువును దశాబ్దాలుగా నిర్వర్తిస్తున్నారు.అమ్మవారి కల్యాణానికి సుమారు 25 రోజుల ముందు విగ్రహాలు రంగుల ఉత్సవానికి జగ్గయ్యపేట తరలి వెళ్తాయి. కల్యాణోత్సవానికి ఒకరోజు ముందు ఆలయానికి చేరుకుంటాయి. మరుసటి రోజు సాయంత్రం ఆలయం వద్ద అమ్మవారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహిస్తారు. ఆలయం నుంచి విగ్రహాలను బయటకు తీసుకొచ్చే ముందు పాపమాంబ వంశీయుల్లోని ప్రధాన అర్చకుడు బోనం చెల్లిస్తారు. శాంతి కల్యాణం నిర్వహిస్తారు. కుమ్మర్లు మట్టికుండల్లో కుంభం (అన్నం) వండుకొని వస్తారు. క్రతువుల అనంతరం రజకులు విగ్రహాలను నెత్తిన పెట్టుకొని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతారు. గ్రామం చివరగా ఉన్న రంగుల విడిది మండపానికి మధ్యాహ్నానికి చేరుకుంటారు. అక్కడ విగ్రహాలను దింపి ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయంవెళ్లేటపుడు ఎడ్లబండ్లు.. వచ్చేటపుడు పల్లకీలురంగుల విడిది మండపం నుంచి లాటరీ ద్వారా ఎంపిక చేసిన రైతుల ఎడ్లబండ్లపై విగ్రహాలను ఉంచి జగ్గయ్యపేట తీసుకెళ్తారు. బండ్లను విద్యుద్దీపాలతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. రాత్రి 10 గంటలకు విగ్రహాలను బండ్లపై ఉంచి భక్తజన సమూహం నడుమ వేడుకగా తెల్లవారేసరికి జగ్గయ్యపేట రంగుబజార్కు చేరుకుంటాయి. మళ్లీ తిరుగు ప్రయాణంలో అందంగా తయారుచేసిన ఎనిమిది పల్లకీలపై 11 విగ్రహాలను ఉంచి పెనుగంచిప్రోలు తీసుకువస్తారు.
5.ఉత్తర ద్వారంలో నెమలి కృష్ణుని దర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామిని సోమవారం భక్తులు ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. ముక్కోటి సందర్భంగా స్వామివారి మూలవిరాట్ను ప్రధానార్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలోని రుత్విక బృందం పట్టువస్త్రాలు, సువర్ణాభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించింది. రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను ఉదయం 5గంటలకు ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉత్తర ద్వారంలో దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని తరించారు. తదుపరి గర్భగుడిలోని శ్రీకృష్ణుని మూలవిరాట్ను దర్శించుకుని పాలపొంగళ్లతో మొక్కులు చెల్లించారు. గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయంలోని గోదాదేవి అమ్మవారికి విశేష అభిషేకాలు, బాలభోగ నివేదన చేశారు. ఆలయ సహాయ కమిషనర్ నేల సంధ్య ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఉభయదేవేరుల సమేతుడైన వేణుగోపాలస్వామికి మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు.
6. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ….
తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూలైన్లలో దాదాపు 50 వేల మంది భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా టీటీడీ అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం గుండానే టీటీడీ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చింది. సోమవారం హుండీ ద్వారా శ్రీవారికి రూ.3 కోట్ల ఆదాయం లభించింది. అలాగే నిన్న శ్రీవారిని 84,160 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఢిల్లీ హైదరాబాదుకు బయల్దేరిన మత్స్యకారులు ..
7. రాశిఫలం – 07/01/2020
తిథి:
శుద్ధ ద్వాదశి రా.2.16 , కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
కృత్తిక మ.1.46
వర్జ్యం:
రా.తె.6.24 నుండి
దుర్ముహూర్తం:
ఉ.0.2 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు విశేషాలు : కూర్మద్వాదశి
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. నోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో జాగ్రత్త అవరం. అనవసరం డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తిచేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
8. పంచాంగము 07.01.2020
సంవరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: శుక్ల
తిథి: ద్వాదశి రా.02:43 వరకు
తదుపరిత్రయోదశి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: కృత్తిక ప.02:15 వరకు
తదుపరి రోహిణి
యోగం: శుభ, శుక్ల
కరణం: బవ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: 09:01 – 09:46
రాహు కాలం: 03:09 – 04:32
గుళికకాలం: 12:22 – 01:45
యమ గండం: 09:34 – 10:58
అభిజిత్ : 12:00 – 12:44
సూర్యోదయం: 06:47
సూర్యాస్తమయం: 05:56
వైదిక సూర్యోదయం: 06:51
వైదిక సూర్యాస్తమయం: 05:52
చంద్రోదయం: ప.02:57
చంద్రాస్తమయం: రా.03:17
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: దక్షిణం
ముక్కోటి ద్వాదశి
కూర్మ ద్వాదశి
త్రిపుష్కర యోగం
సుజన్మ ద్వాదశి వ్రతం
శ్రీ సురేంద్రతీర్థ పుణ్యతిథి
9. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
07.01.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 16C°-22℃°
• నిన్న 84,160 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం తోపాటు
వైకుంఠ ద్వార దర్శనం
కూడా లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో కంపార్ట్మెంట్ లన్నీ
నిండినది, సర్వదర్శనం
కోసం బైట వేచి ఉన్న
భక్తులు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3 కోట్లు,
• నిన్న 18,293 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
నేడు ద్వాదశి
• ఈ రొజు ఉదయం: 4.30
నుండి 5.30 గంటల
వరకు చక్రస్నానం,
ప్రత్యేక దర్శనాలు నిలుపుదల:
• రద్దీ రిత్య నేటి వరకు
దాతలకు ఇచ్చే
సౌకర్యాలు రద్దు,
• ఈ రొజు వృద్ధులు,
దివ్యాంగులకు, చంటి
పిల్లల తల్లిదండ్రుల
ప్రత్యేక దర్శనాలు రద్దు,
• జనవరి 8 వరకు
దివ్యదర్శనం టోకెన్లు,
టైంస్లాట్ సర్వదర్శనం
టోకెన్లు రద్దు,
• జనవరి 8 వరకు తేదీ
వరకు అంగప్రదక్షిణ
టోకెన్లు రద్దు,
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.
తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.ttd Toll free #18004254141తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
10. తిరుమలలో వైభవంగా స్వామివారి చక్రస్నానం
ద్వాదశిని పురస్కరించుకొని తిరులమ శ్రీవేంటేశ్వర స్వామివారికి చక్రస్నానం తితిదే వైభవంగా నిర్వహించింది. వేకువజామున శ్రీవారి సన్నిధి నుంచి చక్రతాళ్వారును పల్లకిలో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం అక్కడ అభిషేకాలు నిర్వహించి శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్లకు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య అర్చకులు పుష్కరస్నానం చేయించారు. ఆ సమయంలో వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు.
శ్రీశైలంలో 12 నుంచి బ్రహ్మోత్సవాలు
Related tags :