Devotional

మల్లన్న బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

Ainavolu Mallikharjuna Swamy Brahmotsavam 2020

1. మల్లన్న బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు –ఆద్యాత్మిక వార్తలు -08/01
మల్లికార్జునస్వామి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. 11 వందల ఏళ్ల అతి పురాతన చరిత్ర కలిగినది ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం. మల్లన్న బ్రహ్మోత్సవాలు(జాతర)జానపదుల జాతరగా పేరుగడించింది. బ్రహ్మోత్సవాలను (సంక్రాంతి నుంచి మొదలుకొని ఉగాది వరకు కొనసాగుతాయి) అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు తేదీలు ఖరారయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ముందు స్వామి వారికి నిర్వహించే దృష్టికుంభం కార్యక్రమం ఇటీవల డిసెంబర్ 22న నిర్వహించారు. జనవరి 13న సోమవారం ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం. 14న మంగళవారం బోగి, 15న బుధవారం మకర సంక్రాంతి నాడు (మార్నేని వంశీయుల పెద్దబండి), బండ్ల తిరుగుతాయి. ఈ కార్యక్రమం చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. 17న శుక్రవారం స్వామివారికి మహాసంప్రోక్షణ కార్యక్రమం. 30న శ్రీ భ్రమరాంభికదేవి అమ్మవారి షష్ట వార్షికోత్సవం. ఫిబ్రవరి 9న అదివారంశ్రీ రేణుకాదేవి(ఎల్లమ్మదేవత) పండగ జరుగనుంది.
*శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు
శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఏకాదశి బుధవారం 19 న నుంచి 23 ఆదివారం వరకు పాంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జునస్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఫిబ్రవరి 19న బుధవారం సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు, 20న గురువారం ఆశ్వ, శేష వాహనసేవలు, 21 శుక్రవారం మహాశివరాత్రి“శివకల్యాణం”పెద్దపట్నం, సింహ, నంది వాహనసేవలు, రాత్రి 8 గంటలకు శ్రీభ్రమరాంబికదేవి మల్లికార్జునస్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవము, రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో అష్టోత్తర శతకలశములచే విశేష మహా అభిషేకము నీరాజన మంత్రపుష్పం.
*22 రావణ వాహనసేవ, సాయంత్రం 7:30 గంటలకు రథోత్సవ సేవ గ్రామంలో ప్రధాన విధుల్లో నిర్వహించుట. 23 అదివారం ఉదయం 7:30 పర్వత వాహనసేవ వసంతోత్సము త్రిశూలస్నానం. రాత్రి 8 గంటలకు పవళింపు సేవతో కల్యాణ బ్రహ్మోత్సవము ముగింపు. మార్చి 25 బుధవారం ఉగాది పండుగ(నూతన సంవత్సరం) బిల్వార్చన, మహనివేదన, నీరాజ మంత్రపుష్పం, ఆలయ ఆవరణంలో పంచాంగశ్రవణము.
**వారంతపు జాతర
జనవరి 19 నుంచి మొదలుకొని మార్చి 25 ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఉగాది జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో మొత్తం 10 ఆదివారాలు, 10 బుధవారం వస్తున్నాయి. ఈ వారంతపు జాతరలో సైతం భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి దర్శంచుకుంటారు.
2. తిరుమలలో మూతబడ్డ వైకుంఠ ద్వారాలు
ఏకాదశి, ద్వాదశి ఘడియలు ముగియడంతో శ్రీవారి ఆలయంలో ఈరోజు వేకువజామున వైకుంఠ ద్వారాలు మూతబడ్డాయి. తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లక్షా 74 వేల 738 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగియడంతో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగియడంతో టీటీడీ, విజిలెన్స్, పోలీసు యంత్రాంగం హర్షాన్ని వ్యక్తం చేసింది.
3. టీటీడీని బాదేస్తున్నారు!
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన విరాళాలను తిరుమల ఆధ్వర్యంలోని సంస్థలకు, సేవలకు ఖర్చు చేయాల్సి ఉండగా.. తనకు సంబంధం లేని ప్రభుత్వ కార్యకలాపాలకు టీటీడీ మళ్లిస్తోంది. ముఖ్యంగా దేవదాయ శాఖకు భారీగా నిధులు మళ్లించడం వివాదాస్పదంగా మారింది. టీటీడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ను సవరిస్తూ ఇటీవల పాలకమండలి సమావేశంలో చర్చకు పెట్టారు. ‘సర్వ శ్రేయోనిధి’గా పిలిచే కామన్ గుడ్ ఫండ్(సీజీఎ్ఫ)కు బడ్జెట్లో తొలుత రూ.1.25 కోట్లు మాత్రమే కాంట్రిబ్యూషన్ కింద కేటాయించారు. బడ్జెట్ సవరింపుల్లో ఏకంగా రూ.13.75 కోట్లు అదనంగా కేటాయించారు. దేవదాయశాఖ సంక్షేమ నిధికి తొలుత రూ.50 లక్షలు కేటాయించగా సవరింపుల్లో రూ.10 కోట్లకు పెంచారు. అర్చకుల వేతనాల నిధికి కూడా బడ్జెట్లో తొలుత రూ.50 లక్షలు కేటాయించిన టీటీడీ తాజా సవరింపుల్లో ఒకేసారి రూ.25 కోట్లకు పెంచింది. దేవదాయ శాఖ అర్చకుల వేతనాలకు బడ్జెట్లో తొలుత అసలు కేటాయింపులేవీ చేయలేదు. తాజా సవరింపుల్లో రూ.16 కోట్లు కేటాయించారు. మొత్తం మీద టీటీడీతో సంబంధంలేని దేవదాయ శాఖ వ్యవహారాలకు కాంట్రిబ్యూషన్ కింద తొలుత రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించిన టీటీడీ పాలకమండలి.. సవరింపుల్లో రూ.66 కోట్లకు పెంచడం గమనార్హం. కామన్ గుడ్ ఫండ్, ఎండోమెంట్ అర్చక ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్లకు కాంట్రిబ్యూషన్ను వరుసగా రూ.15 కోట్లు, రూ.10 కోట్లు, రూ.25 కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు.
*సొంత సంస్థలకు మొండిచేయి
టీటీడీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సొంత సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు చాలా తక్కువగా ఉండడం గమనార్హం. సొంత విద్యా సంస్థలకు 2019-20 బడ్జెట్లో తొలుత రూ.105 కోట్లు కేటాయించిన టీటీడీ.. తాజా సవరింపుల్లో రూ.8 కోట్లు పెంచింది. టీటీడీ నిర్వహిస్తున్న ఆస్పత్రులు, డిస్పెన్సరీల నిర్వహణకు బడ్జెట్లో రూ.47 కోట్లు కేటాయించగా సవరింపుల్లో కేవలం రూ.3 కోట్లు పెంచారు. స్విమ్స్, బర్డ్, ఎస్ఎస్ఎస్ఎన్ ట్రస్టు, శ్రవణం ప్రాజెక్టు వంటి పరోక్షంగా నిర్వహిస్తున్న సంస్థలకు బడ్జెట్లో తొలుత రూ.79 కోట్లు కేటాయించగా సవరింపుల్లో రూపాయి కూడా పెంచలేదు.
*నిధుల మళ్లింపుపై దుమారం
టీటీడీ నిధులను భారీగా ఇతర కార్యక్రమాలకు మళ్లించడం పట్ల దుమారం రేగుతోంది. సాంకేతికంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించాలని ఆదేశించలేదు. అలాంటి ప్రతిపాదన ఉన్నా.. ఆదేశం మాత్రం కాదు. తాజా ఉదంతంలో అధికారులు దీనిని పట్టించుకోలేదు. దీనికితోడు పాలకమండలి ఒత్తిళ్ల మేరకు కొత్తగా మరిన్ని ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఆలయాలను దత్తత తీసుకోవడం వల్ల టీటీడీపై ఆర్థిక భారం మరింత పెరిగిపోనుంది. వీటిపై టీటీడీ ఆర్థిక సలహాదారు ఏం చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది.
4. శబరిమల’పై సుప్రీం కొత్త బెంచ్
శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో 9 మంది జడ్జీలు ఈ నెల 13 నుంచి ఆయా వ్యవహారాలపై వాదనలు విననున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్ఎస్రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్లు ఉన్నట్లు మంగళవారం వెల్లడించింది. శబరిమల అంశంపై గతంలో వాదనలు విన్న ఏ న్యాయమూర్తి ఇందులో లేకపోవడం గమనార్హం. అన్ని వయసుల వారిని శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ 2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ యువ న్యాయవాదుల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.
5. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
07.01.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుల: 16C°-22℃°
• నిన్న 84,160 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం తోపాటు
వైకుంఠ ద్వార దర్శనం
కూడా లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో కంపార్ట్మెంట్ లన్నీ
నిండినది, సర్వదర్శనం
కోసం బైట వేచి ఉన్న
భక్తులు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3 కోట్లు,
• నిన్న 18,293 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
నేడు ద్వాదశి
• ఈ రొజు ఉదయం: 4.30
నుండి 5.30 గంటల
వరకు చక్రస్నానం,
ప్రత్యేక దర్శనాలు నిలుపుదల:
• రద్దీ రిత్య నేటి వరకు
దాతలకు ఇచ్చే
సౌకర్యాలు రద్దు,
• ఈ రొజు వృద్ధులు,
దివ్యాంగులకు, చంటి
పిల్లల తల్లిదండ్రుల
ప్రత్యేక దర్శనాలు రద్దు,
• జనవరి 8 వరకు
దివ్యదర్శనం టోకెన్లు,
టైంస్లాట్‌ సర్వదర్శనం
టోకెన్లు రద్దు,
• జనవరి 8 వరకు తేదీ
వరకు అంగప్రదక్షిణ
టోకెన్లు రద్దు,
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.
తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.
ttd Toll free #18004254141
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
6. 23వ పాశురము
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్ శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్ కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
నైవేద్యం : శర్కరై పొంగల్
23వ పాశురం తాత్పర్యం
నల్లని అవిసెపువ్వు వంటి శరీరపు కాంతి కలిగిన ఓ శ్రీకృష్ణా, నీలముతో నిండిన అతసీపుష్పములాగా మెరిసే నీలమణి కాంతి కలిగిన చక్కనివాడా, స్వామీ, వర్షాకాలములో గుహలో నిద్రించే మృగరాజులాగా మేల్కొని, రెండు కాళ్లను ముందుకు చాపి, నిగడదన్నునట్లుగా జూలును విదిల్చి, శరీరమును నలువైపులా కదిలించి, తీక్షణముగా ఒళ్లు విరుచుకొని, సాగి నిలబడి గట్టిగా గర్జిస్తూ, గుహ బయటకు వచ్చు సిం హము వలె గంభీరమైన ఆకారము కలిగిన ఓ శ్రీ కృష్ణా, నీవు కూడా నీ భవనము నుండి మృగరాజువలె బయటకు వచ్చి, వీర సిం హాసనముపై కూర్చొని, దయతో మా ప్రార్థనను ఆలకించి, మేము వచ్చిన పనిని విని, నీ దయాదృష్టితో మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నీవు నీ మందిరము నుండి బయటకు వచ్చునప్పుడు, నీ అందమును చూసి ఆనందించవలసినదే కాని వర్ణించడము ఎవరి తరమూ కాదు. ఆబోతు నడకలోని ఠీవి, ఏనుగు నడకలోని గాంభీర్యము, పెద్దపులి నడకలోని చురుకుదనము, సిం హము నడకలోని వైభోగము అంతా నీ నడకలో మేము చూసి ఆనందించునట్లుగా, నీ భవనము నుండి బయటకు వచ్చి, మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నీవు వచ్చి రక్షించే వరకు వేచి వుండే ఓపిక, సహనము మాకు వున్నాయి. నీ ఎడబాటును భరించలేక మేమే నీ వద్దకు వచ్చాము. నీ దర్శనమును కలిగించి మమ్మల్ని అనుగ్రహించు, అని గోపికలతో కలసి ఆండాళ్ తల్లి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
7. ఓ నమో వేంకటేశాయ:
07.01.2020న తిరుమల సాయంత్రం వరకు
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య : 61,846
07.1.2020 తేదీ నాటికి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో
భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు : 31 నిండిపోయి క్యూ లైన్ బయట వెళ్ళుతోంది.
సర్వదర్శనం కోసం పట్టు సమయం : 18 గంటలు
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య :
హుండీ ఆదాయం రూ.
మరిన్ని వివరాలకు http://www.edukondalu.com/
ద్వాదశి చక్రస్నానం వీడియో
http://www.edukondalu.com/2020/01/07/chakra-snanam-in-tirumala/
8. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు బుదవారం,
08.01.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 13C°-24℃°
• నిన్న 90,578 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం తోపాటు
వైకుంఠ ద్వార దర్శనం
కూడా లభించింది,
• వైకుంఠ ఏకాదశి ద్వాదశి
సందర్భంగా వైకుంఠద్వార
దర్శనం చేసుకున్న
1,74,738 మంది
భక్తులు,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 03 కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
05 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 16,149 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.19 కోట్లు,
• నిన్న 16,186 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ప్రత్యేక దర్శనాలు నిలుపుదల:
• జనవరి 8 వరకు
దివ్యదర్శనం టోకెన్లు,
టైంస్లాట్‌ సర్వదర్శనం
టోకెన్లు రద్దు,
• జనవరి 8 వరకు తేదీ
వరకు అంగప్రదక్షిణ
టోకెన్లు రద్దు,
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.
తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.
ttd Toll free #18004254141రుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
9. నీలకంఠేశ్వరా.. నీ వైభవం చూడతరమా-ఈ నెల 12న మహా రథోత్సవం ఆది దంపతుల బ్రహోత్సవ వేడుకలు
భక్తుల ఇలవేల్పు నీలకంఠేఫఫశ్వరుడిని.. నమ్మిన వారికి వరం ఇస్తాడని నమ్మడం ఇక్కడి ప్రత్యేకత. ఏటా జాతర రోజు వస్తే చాలు.. ప్రతి ఇంట్లో శివ నామ స్మరణ చేస్తూ భక్తులు పూజలు చేస్తారు. స్వామి రథోత్సవానికి సొంత గ్రామానికి చేరుకొని మొక్కులు తీర్చుకోవడంసంప్రదాయం. బాలికలకు కుంకుమ, పసుపు, చీరలిచ్చి తీపి పదార్థాలు ఇవ్వడం ప్రత్యేకత. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆద్యంతం నీలంకఠేశ్వరుడి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే వేడుక చూద్దాం రారండి.
**ఈ కార్యక్రమాలు
* 10.1.2020 వికారి నామ సంవత్సరం పౌర్ణమి రోజున శుక్రవారం రాత్రి 9:30 గంటల నుంచి అర్థరాత్రి 12.20 నిమిషాల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
*11.1.2020: ప్రభావళి మహోత్సవం రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు
* 12.1.2020: ఉదయం స్వామిని వెండి అభరణాలతో అలంకరిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి గుడి నుంచి తేరు రథశాల వరకు స్వామి మూల విగ్రహాలను ఊరేగిస్తారు. అనంతరం 4.20 గంటల నుంచి 5.30 గంటల వరకు హోమాలు నిర్వహిస్తారు. అనంతరం మహా రథోత్సవం ప్రారంభమౌతుంది.
*13.1.2020: రాత్రి 9.10 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాహావళి ఉత్సవం
* 14.1.2020: సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు తీర్థావళి, వసంతోత్సవం నిర్వహిస్తారు.
**12న మహా మహా రథోత్సవం
నీలకంఠేశ్వరుడి బ్రహోత్సవాల్లో భాగంగా పట్టణంలోని తేరు బజారులో ఈ నెల 12వ తేదీన మహా రథోత్సవం నిర్వహిస్తారు. ఉదయం స్వామిని వెండి అభరణాలతో అలంకరిస్తారు. రుద్రాభిషేకం, కుంకుమార్చన చేస్తారు. స్వామికి మొక్కు బడులు తీర్చేందుకు వేలాదిగా తరలి వస్తారు. నాలుగు గంటలకు పార్వతీ, పరమేశ్వరుల విగ్రహాలను పల్లకిలో ఉంచి గర్భగుడి నుంచి వీధుల్లో ఊరేగిస్తారు. కోలాటం, గొరవయ్య నృత్య ప్రదర్శన మధ్య వేడుక నిర్వహిస్తారు. అనంతరం గడిగ వంశస్తులు పూర్ణ కుంభంతో స్వామికి ప్రసాదాన్ని తీసుకొస్తారు. అనంతరం దేవాదాయ శాఖ, వంశ పారంపర్య ధర్మకర్త మాచాని నీలకంఠప్ప వంశస్థులు యజ్ఞ హోమాలు నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లను రథంపై ఎక్కించి పూజలు చేస్తారు. అనంతరం ఆరు గంటలకు స్వామి రథం లక్షలాది భక్తుల మధ్య కదులుతుంది. రథశాల నుంచి ఎదురు బసవన్న గుడి వరకు ఓంనమఃశివాయ అంటూ భక్తులు జేజే ధ్వనుల మధ్య రథం లాగుతారు. యదార్థ స్థానం చేరుకున్న తర్వాత స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి, దేవాలయానికి చేర్చుతారు. ఇలా మహా రథం లక్షలాది భక్తుల మధ్య సాగుతుంది. వేడుక కనులారా చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.
**ప్రత్యేకత
నీలంకంఠేశ్వరుడు ఉన్న ప్రాంతంలో ఓ నాడు ఎనుమలూరుగా ఉండేది. పూర్వం ఊరిసంతలో ఎనుముల(గేదే) క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున జరిగేవి. ఈ ఊరి సంతకు కర్నూలు, గద్వాల, వనపర్తి, కంప్లి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయించారు. అప్పట్లో గేదె ధర రూ.100 ఉండేదని పెద్దలు చెబుతున్నారు. గేదెను కన్నడంలో ఎనుము అంటారని, ఆ పదం నుంచి ఎనములూరు ప్రచారంలోకి వచ్చిందని కొందరు వివరిస్తారు. మరింత మంది హెమ్మే అంటే కన్నడంలో గర్వం అని గణపతులను ఓడించిన శ్రీకృష్ణ దేవరాయులు వారి తరఫున వచ్చి యజ్ఞ హోమాలు చేశారని నమ్మకం. ఆ సమయంలో తనలో అహాన్ని తొలగించమంటూ నీలకంఠేశ్వరుడి యాగం నిర్వహించారని, తొలగించిన ఊరు గనుక ఇది హెమ్మగనూరుగా… అనంతరం ఎమ్మిగనూరుగా ప్రసిద్ధి చెందిందని వృద్ధులు చెబుతుంటారు.
**ఆడపడుచుల దీవెనలు…
ప్రతి ఇంట్లో ఆడపడుచులను పిలుచుకొని వారికి చీర, పసుపు, కుంకుమ ఇచ్చి సత్కరించడం పండగ ఆచారం. పుష్య మాసం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్త శ్రద్ధలతో వేడుకను కన్నుల పండగగా నిర్వహిస్తారు. కర్నాటక ఆంధ్రుల ఇలవేల్పుగా నీలకంఠేశ్వరుడు చేనేత పురిలో భక్తులకు దర్శనమిస్తారు. జాతరకు వచ్చిన ఆడపడుచులకు పసుపు కుంకుమ, చీర, విభూతి, మిఠాయిలు, ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. సంప్రదాయం ప్రకారం బ్రహోత్సవాల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఈశ్వరుడికి నామంతో పులకించి పోతోంది. జాతర అంటే ఎంతో ప్రత్యేకత ఉంటుంది.రైతుల జాతరనీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో జనసందడి కనిపించింది. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర ఎద్దుల బండలాగుడు, బల ప్రదర్శన, అంతర్రాష్ట్ర ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, నాటక ప్రదర్శన జరుగుతాయి. ప్రతి రోజూ పండగ వాతావరణం ఉంటుంది. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భారీ ఎత్తున జనం హాజరవుతారు. అనంతరం రైతులు ఎద్దులను కొనుగోలు చేస్తారు. రైతులకు అవసరమైన సామగ్రి తీసుకొని భద్రపర్చుకుంటారు.
**కనులారా వీక్షిస్తూ
శంభో శంకరుడికి.. పూజలు జరిపిన తర్వాత ప్రతి ఒక్కరూ కొత్త వస్తువుల కొనుగోళ్లు ప్రారంభిస్తారు. సేద్యం, పెళ్లిళ్లు, కొత్త వస్తువుల తయారీ, స్వామికి సమర్పించిన తర్వాత విక్రయిస్తారు. ఇవన్నీ ఆచార సంప్రదాయాలకు దర్పణం పడతాయి. స్వామిని చూడడానికి రెండు కళ్లు చాలవు. దాదాపు నెల రోజులపాటు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. పుష్య మాసంలో పూజలు జరిపేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తెలంగాణ, ఏపీ, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలతోపాటు ఎమ్మిగనూరు ప్రాంతీయులు బ్రహోత్సవాలకు తప్పకుండా హాజరవుతారు.
10. వైష్ణోదేవి ఆలయంపై మంచు దుప్పటి… హెలికాప్టర్ సేవలు బంద్!
మాతా వైష్ణోదేవి ఆలయంపై మంచు దుప్పటి పరుచుకుంది. ఆలయ పరిసరప్రాంతాల్లో అంతకంతకూ మంచు పేరుకుపోతోంది. ఈ నేపధ్యంలో వైష్ణోదేవి ఆలయ బోర్డు హెలీకాప్టర్ సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా రెస్క్యూటీమ్ ఆలయానికి వస్తున్న భక్తులకు రక్షణగా నిలుస్తోంది. భారీస్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా ఆలయానికి వెళ్లే రహదారులన్నీ మూసుకుపోయాయి. దీంతో వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పాత రహదారి గుండా భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు.
11. జనవరి 10వ తేదీన తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 10వ తేదీ నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ఆధ్యయనోత్సవాలు జరుగుతున్నందున ఈనెల10వ తేదీ శుక్ర‌వారం శ్రీవారి గరుడసేవను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
12. ఇప్పటికైనా టిటిడీ మంచి నిర్ణయం తీసుకుంది- ఐవైఆర్
తిరుమల తిరుపతి దేవస్థానాల కు చెందిన నిధులను ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు మల్లిస్తున్నరంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ విఆర్ కృష్ణారావు తప్పుఅట్టారు. తితిదేని బాదేస్తున్నారు అనే కధనంతూ వచ్చిన ఈవార్తలో శ్రీవారికి భక్తులు సమర్పించే విరాళాలను తిరుమల ఆద్వర్యంలోని సంస్థలు, సేవలకు ఖర్చు చేయాల్సి ఉండగా తనకు సంబంధం లేని ప్రభుత్వ కార్యకలాపాలకు తితిదే తరలిస్తోందని సదరు పత్రిక పేర్కొంది. ముఖ్యంగా దేవాదాయ శాఖకు పెద్ద ఎత్తున నిధులను మల్లించాదాన్ని తప్పుబట్టింది.