నటిగా కంటే వివాదాస్పద సంఘటనలతోనే ఎక్కువగా పాపులర్ అయిన నటి అమలాపాల్ అని పేర్కొనవచ్చు. కోలీవుడ్‌లో తొలి చిత్రంలోనే చర్చనీయాంశ కథా పాత్రలో నటించి వార్తల్లోకి ఎక్కింది. ఆ తరువాత మైనా చిత్ర విజయంతో నటిగా పేరు తెచ్చుకుంది. ఇక దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి సంచలన నటిగా ముద్ర వేసుకుంది. ఆయన్ని పెళ్లి చేసుకుని రెండేళ్లలోనే విడిపోయి విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయినా కథానాయకిగా నిలదొక్కుకుందంటే ఆమె సంపాధించుకున్న పాపులారిటీనే కారణం అని చెప్పవచ్చు. కాగా ఆ మధ్య ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్ వరకరూ వెళ్లి కలకలం సృష్టించింది. అలా ఆమె ధైర్యానికి పోలీసులతో కూడా ప్రశంసులు అందుకుంది. ఇకపోతే విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఖర్చు తగ్గుతుందని పాండిచేరిలో రిజిస్టర్ చేయించుకుని వివాదాల్లోకి ఎక్కింది.
కసరత్తులతో కైపెక్కిస్తున్నది
Related tags :