* అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తమ స్టోర్‌లో.. బీరువా (డ్రెస్సర్) మీద పడి మృతి చెందిన బాలుడు జోసెఫ్ (2) కుటుంబానికి రూ.300 కోట్ల పరిహారం చెల్లించేందుకు ప్రసిద్ధ ఐకియా సంస్థ అంగీకరించింది. 2017 మే నెలలో జోసె్‌ఫను తీసుకుని తల్లిదండ్రులు క్రెయిగ్, జోలిన్‌లు షాపింగ్‌కు వెళ్లారు. జోసెఫ్ ఆడుకుంటూ.. స్టోర్‌లోని బీరువా (డ్రెస్సర్)ను లాగాడు. అది ఒక్కసారిగా మీదపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనికి డ్రెస్సర్ తయారీ లోపమే కారణమంటూ క్రెయిగ్, జోలిన్ న్యాయ పోరాటానికి దిగారు.
* మాజీ ఎమ్మెల్యే బోండా ఉమపై కేసు నమోదైంది. సోమవారం గృహనిర్భంధం సందర్భంగా పోలీసుల విధినిర్వహణకు ఆటంకం కలిగించారని అభియోగించారు. ఐపీసీ 353 సెక్షన్ కింద ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. బోండా ఉమపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
* ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్ పీహెచ్‌సీ సూపర్‌వైజర్ లూసీ ఆత్మహత్యాయత్నం చేసింది.
* జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో భారీ వర్షానికి ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 14 ఏళ్ల మనీషా అనే బాలిక మృతి చెందగా..ఆమె తల్లి చంచలా దేవి (45), సోదరి శీలా దేవి(19)కి గాయాలయ్యాయి.
* తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకుని నల్గొండకు తిరిగి వెళ్తున్న వోల్వో బస్సును ఎదురుగా వస్తున్న అమరావతి బస్సు ఢీకొంది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా… చంద్రగిరి మండలం కాసిపెంట్ల వద్ద జరిగింది.
* తర్వాత తన కారు డ్రైవర్ బోడ నవీన్ (20)తో కలిసి ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లాడు. బీరువా పగులగొట్టి 10 తులాల బంగారు నగలు, రూ.2.88 లక్షలు దోచేశాడు. తర్వాత దొంగలు పడ్డారని భార్యను నమ్మించేందుకు తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.
* శంషాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. మూడు రోజుల క్రితం హాస్టల్ నుండి బయటకు వెళ్ళి కనిపించకుండా పోయిన తమ కొడుకు భరత్ జాడ తెలియకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ రీజియన్‌లోని హృదయాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో క్రూడ్ బాంబులు కలకలం రేపాయి. బుధవారం మధ్యాహ్నం స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులను రైల్వే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. భారత్ బంద్ ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. ఆందోళనలో ఎవరైనా అల్లరి మూకలు చేరి ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
* ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్ పీహెచ్‌సీ సూపర్‌వైజర్ లూసీ ఆత్మహత్యాయత్నం చేసింది. మెడికల్ ఆఫీసర్ లైంగికంగా వేధిస్తున్నాడని పేర్కొంటూ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
* జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో భారీ వర్షానికి ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 14 ఏళ్ల మనీషా అనే బాలిక మృతి చెందగా..ఆమె తల్లి చంచలా దేవి (45), సోదరి శీలా దేవి(19)కి గాయాలయ్యాయి.
* ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్ పీహెచ్‌సీ సూపర్‌వైజర్ లూసీ ఆత్మహత్యాయత్నం చేసింది. మెడికల్ ఆఫీసర్ లైంగికంగా వేధిస్తున్నాడని పేర్కొంటూ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
* రాజధాని అమరావతి ప్రాంతంలో మరో రైతు మృతిచెందారు. ఐనవోలులో పాలకాయల మాధవ అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. రాజధాని కోసం తన అర ఎకరం భూమిని ప్రభుత్వానికి ఆయన ఇచ్చారు. ప్రస్తుతం రాజధాని అమరావతి తరలిపోతుందనే వార్తల నేపథ్యంలో అనారోగ్యానికి గురై ఆ ఆవేదనతోనే మాధవ చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు
* ఆద్యాత్మిక నగరం తిరుపతిలో తెల్లవారు జమున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎపీఎస్ ఆర్టీసీకి చెందిన అమరావతి వోల్వో బస్సు ప్రేవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డీకొని ఇద్దరు దుర్మరణం చెందారు.
* ఆస్ట్రేలియాలోని కొన్ని ఆదివాసీ ప్రాంతాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. దీంతో నివారణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నీటి వనరులు లేకపోవడం వల్లే కరువు సంభవిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఒంటెలు అధికంగా నీటిని వినియోగించడం ద్వారా కరువు సంభవిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో 10 వేల ఒంటెలను కాల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియను ఐదు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.
* ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
* భార్యతో గొడవపడి మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
* గెస్ట్ హౌస్‌లో ఉంటున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
* ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ పాల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
* ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
* అల్లూరు మండలం గోగులపల్లి వీఆర్వో కె.సుధాకర్‌ను ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిజిటల్ పాసుపుస్తకం కోసం వీఆర్వోను ఆశ్రయించిన రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
* అమరావతిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన హైవే దిగ్బంధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు.
* రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. హైదర్‌గూడకు చెందిన సౌజన్య నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులుస్నేహితుల ఇళ్లలో లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 176 మంది ప్రయాణికులు, సిబ్బందితో కీవ్ వెళ్తున్న ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది
* ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో 80 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాడుల్లో కనీసం 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మృతిచెందారని ఇరాన్ అధికారిక టీవీ పేర్కొనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
* చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. శబరిమల నుంచి నల్గొండకు అయ్యప్ప భక్తుల బృందంతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
* ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది.
* పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు చెప్పారు.
* యువకుడి తొడలో దిగిన గునపం- ఓ యువకుడి తొడలోకి చొచ్చుకెళ్లిన గడ్డపారను అనంత సర్వజనాసుపత్రి వైద్యులు తొలగించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేటకు చెందిన నారాయణస్వామి మంగళవారం ఉపాధి హామీ పథకం పనుల కోసం సామగ్రిని తీసుకుని బైక్పై వెళ్తున్నారు. మధ్యలో బైకు అదుపుతప్పి కిందపడగా గడ్డపార కుడి తొడలోకి దూసుకెళ్లింది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. సర్జరీ విభాగం హెచ్ఓడీ ఆచార్య రామస్వామినాయక్ సారథ్యంలో వైద్యబృందం శస్త్ర చికిత్స చేసి గడ్డపారను తొలగించింది.
* ఆయుర్వేద నూనెలు కొంటాం… బహుమతులు పంపుతామంటూ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లు లక్కీ ఓజా, జేమ్స్ ఒబాసీలను సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఆరు చరవాణులు, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపారు.
* సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడే చంబల్లోయ ప్రాంతానికి చెందిన ముకియా ముఠా నగరంలోకి ప్రవేశించింది. గత నెల 9న బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ప్రముఖ వ్యాపారి నివాసంలో జరిగిన భారీ చోరీ వెనుక ఈ ముఠా సభ్యుడు ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
* ఓ సైకో చేష్టలకు యాచకుడు బలయ్యాడు. సైదాబాద్ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీ పరిధి హరిజనబస్తీకి చెందిన తాళ్లపాక దయానంద్(50) అనాథ. యాచకుడిగా ధోబీఘాట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. మంగళవారం ఉదయం ధోబీఘాట్లో కూర్చొని ఉండగా, మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి అటువైపుగా వచ్చాడు. తన చొక్కా విప్పి యాచకుడి మెడచుట్టూ బిగించి కొద్దిదూరం వరకు లాక్కెళ్లాడు. సమీపంలోని కూలీలు గమనించి యాచకుడిని కాపాడారు. పాదబాటపై కూర్చోబెట్టి మాట్లాడుతుండగా.. రెచ్చిపోయిన సైకో అమాంతం యాచకుడి రెండు కాళ్లు పట్టి గట్టిగా లాగాడు. దీంతో యాచకుడి తల పాదబాటకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సెక్టార్ ఎస్సై సి.రాముడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
* నెల్లూరు – పూతలపట్టు రహదారిపై కాశిపెంట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి కుప్పం వెళుతున్న వోల్వో బస్సు, కాశిపెంట్ల వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 36 మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
* గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు.
* సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలపై రవాణాశాఖ దాడులు ఆరంభించింది. సోమవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 73 బస్సులను సీజ్ చేశారు. వీటికి భారీ జరిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.
* ఆదాయానికి మించి ఆస్తులున్న అటవీ అధికారి కోనా రామకృష్ణ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించారు. రూ.3 కోట్లకుపైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
* బట్వాడా చేయాల్సిన ఉత్తరాలను నిప్పంటించిన ఘటనలో ఆరుగురు ఉద్యోగులపై తపాలా శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఇందులో ఇద్దరు క్లర్కులు, పోస్టుమ్యాన్, పోస్టుఉమెన్, ఇద్దరు గ్రామీణ డాక్ సేవక్లు ఉన్నారు. ఈ నెల మూడవ తేదీన కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ వివాదాస్పద స్థలంలో ఉత్తరాలు, కవర్లు, బ్యాంకు చెక్బుక్లు, ఆధార్ కార్డులను ఓ వ్యక్తి కాల్చి వేస్తుండగా పోలీసులు అడ్డుకొని తపాలా శాఖకు సమాచారం ఇచ్చిన విషయం విదితమే.
* ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది.
* మద్యం అనుకొని పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నమ్‌పల్లి గ్రామంలో జరిగింది.
* భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయపాకల గ్రామానికి చెందిన జి.బోగురయ్య(30) బతుకుదెరువు కోసం 8 ఏండ్ల క్రితం భార్య పద్మ ఇద్దరు పిల్లలతో కలిసి సిటీకి వచ్చాడు. వీరు అంజయ్యనగర్ సంస్కృతి హోటల్ సమీపంలో ఉంటున్నారు. బోగురయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
బోండా ఉమపై కేసు-నేరవార్తలు
Related tags :