DailyDose

పెరిగిన డాలర్ విలువ-వాణిజ్యం

Dollar Gets Strong-Telugu Business News Roundup

* వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలకు సంబంధించిన పలు విషయాలు వెల్లడయ్యాయి. 2020, జనవరి 14న సంస్థ ఈ ద్విచక్రవాహనాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.20లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ ద్విచక్రవాహన విక్రయాలు మొదట పుణెలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా బెంగళూరు సహా ఇతర మెట్రోనగరాల్లోనూ విక్రయిస్తామని సంస్థ ఇదువరకే తెలిపింది. స్కూటర్‌ విడుదల చేసిన తర్వాత బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయని సంస్థ వెల్లడించింది.
* ఇరాన్‌-అమెరికా ఉద్రికత్తల నడుమ దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు. 71.82తో పోలిస్తే డాలరుమారకంలో మరోసారి 72 స్థాయికి పోయింది. ప్రస్తుతం 20 పైసలు పతనమై 72.02 వద్ద ఉంది. మరోవైపు అమెరికా-ఇరాన్‌ టెన్షన్స్‌ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాక్‌లోని అమెరికి సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడి అనంతరం అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒకదశలో 70డాలర్లకు చేరింది.
* ప్రైవేటు రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌లో వాటాల కొనుగోలుపై ఎటువంటి ఆసక్తి లేదని బుధవారం ప్రముఖ పేమెంట్‌ సర్వీసింగ్‌ యాప్‌ పేటీఎం పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌ ఈటీనౌ పేర్కొంది. నేటి మార్కెట్లో మధ్యాహ్నం 2.45 సమయంలో పేటీఎం షేరు 2 శాతం లాభాలతో రూ.46 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం బ్యాంక్‌ బోర్డు సమావేశం నిర్వహించి నిధుల సేకరణకు పచ్చజెండా ఊపవచ్చనే సమాచారం షేరు ధర పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ బ్యాంకులో సైటెక్స్‌ హోల్డింగ్స్‌, సైటెక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు యస్‌బ్యాంక్‌ వెల్లడించింది.
* అమెరికా-ఇరాన్‌ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు భారత్‌ మార్కెట్లను బెంబెలెత్తిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిన్నటి సెషన్‌లో పుంజుకున్న సూచీలు బుధవారం ఉదయం నుంచి నష్టాల్లోనే పయనిస్తున్నాయి. ఉదయం 9.55 నిమిషాలకు సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టపోగా 11.30 గంటల సమయంలో 300 పాయింట్ల మేర పడిపోయింది. అటు నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 12వేల మార్క్‌ దిగువనే కొనసాగుతోంది.
* గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోతూ వస్తున్నా భారత జీడీపీ ద్రుదిడ్ రేటు 2019-20ఆర్ధిక సంవత్సరంలో మరింత దిగాజారనుందని కేంద్రం అంచనా వేసింది.
* అమేజ్‌ఫిట్‌ కంపెనీ టి-రెక్స్‌ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో.. 1.3 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ మానిటర్‌, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, 19 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.10,070 ధరకు ఈ వాచ్‌ వినియోగదారులకు లభిస్తున్నది.
* బీఎస్-6 ఉద్గార ప్రమాణాలతో ‘క్లాసిక్ 350’ మోడల్ను రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.65 లక్షలు (ఎక్స్షోరూం). ‘ఈ ఏడాది మార్చి 31 కల్లా మిగిలిన మోటార్ సైకిళ్లను కూడా బీఎస్-6 ఇంజిన్తో తీసుకొస్తామ’ని కంపెనీ సీఈఓ వినోద్ దాసరి పేర్కొన్నారు.
* ఎయిరిండియా ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగు పడింది. ఆ మేరకు బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం (జీఓఎమ్) అనుమతినిచ్చింది.
* దివాలా పరిష్కార ప్రక్రియ సమర్పించకుండా నిషేధానికి గురైన వ్యక్తులకు, లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్న కంపెనీ ఆస్తులను రుణదాత విక్రయించకుండా నిబంధనలను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) సవరించింది.
* రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు పుంజుకున్నాయి. అమెరికా- ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం కలిసొచ్చింది. ముడిచమురు ధరలు సైతం కాస్త శాంతించడంతో రూపాయి బలపడింది.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ‘2020-21లో ఎల్ఐసీని నమోదు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఇది ఒకట’ని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం అధికారి ఒకరు కోజెన్సిస్ వార్తా సంస్థకు చెప్పారు
* హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ కంపెనీ సువెన్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్ విభజనకు మార్గం సుగమం అయింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎన్సీఎల్టీ (జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ అనుమతి ఇచ్చింది. సువెన్ లైఫ్సైన్సెస్ను ఔషధ వ్యాపారానికి ఒక విభాగం పరిశోధనా సేవలకు మరొక విభాగంగా విభజించాలని యాజమాన్యం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
* సరఫరా రంగంలో ఉన్న సంస్థలకు సాఫ్ట్వేర్ సేవలను అందించే బ్లూజే సొల్యూషన్స్ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇక్కడ 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేయనున్నారు. ఇక్కడ పరిశోధన- అభివృద్ధి, ఆర్థిక, వినియోగదారులకు, వృత్తిపరమైన సర్వీసులు, క్లౌడ్ సేవలను అందిస్తామని మంగళవారం కార్యాలయ ప్రారంభం సందర్భంగా సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ఆండ్రూ కిర్క్వుడ్ తెలిపారు.