ఇండ్లు, ఆఫీసులకు కాపలా కాసేందుకు వాచ్‌మన్ ఉంటాడు. మరి, మన గుండెకు? ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ క్లాట్ (రక్తపు ముద్ద/గడ్డ) వచ్చి గుండెపై దాడి చేస్తుందో తెలియదు. వాటిని అడ్డుకునే ఓ ‘వాచ్‌మన్’ ఉంటే బాగుంటుంది కదా. దానినే తయారు చేశారు బ్రిటన్ రాజధాని లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ హాస్పిటల్ డాక్టర్లు. మామూలుగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంటుంది. దాని కోసం ఓ స్టెంట్ వేస్తారు. కొన్ని కొన్ని సార్లు బ్లడ్ క్లాట్లు గుండెలోకి చేరి, అక్కడి నుంచి బ్రెయిన్‌లోకి వెళ్లి ఆక్సిజన్ సప్లైని అడ్డుకుంటూ ఉంటాయి. దాని వల్ల స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు ఆ క్లాట్లకు గుండె దగ్గరే చెక్‌పెట్టేలా జెల్లీ ఫిష్ ఆకారంలో జల్లిలా ఉండే ఈ ‘వాచ్‌మన్’ను తయారు చేశారు. ఓ రక్తనాళం గుండా ఓ కెథెటీర్ను (పైపు లాంటిది) గుండె గదుల నుంచి పంపి రక్తం ఎంటరయ్యే దగ్గర దానిని పెడతారు. తిరగి కెథెటీర్ను వెనక్కు తీసుకునేటప్పుడు గొడుగులా ముడుచుకుని ఉండే వాచ్‌మన్ ఓపెన్ అవుతుంది. మెటల్ జల్లి చుట్టూ ఓ పాలియెస్టర్ నెట్ ఉంటుంది. దీంతో రక్తనాళాల్లో ఏర్పడిన బ్లడ్ క్లాట్లు గుండెలోకి చేరకుండా అక్కడే ఇది అడ్డుకుంటుంది. ‘‘ఇంతకుముందే కొన్ని రకాల డివైస్‌లు వచ్చినా అవి పేషెంట్ గుండె ఆకారానికి తగినట్టుగా ఉండేవి కాదు. ఇప్పుడు ఆ సమస్యను దాటి పేషెంట్ గుండె తీరును బట్టి వాచ్‌మన్‌ను తయారు చేశాం” అని హాస్పిటల్ డాక్టర్ సందీప్ పణిక్కర్ చెప్పారు. రక్తాన్ని పలుచగా చేసే మందులకు సమానంగా దీని ప్రభావం ఉంటుందన్నారు.
గుండెకు కాపలాదారుడు
Related tags :