నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అందాల భామ మెహరీన్ కౌర్ పిర్జాదా. చాప కింద నీరులా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు పొందుతూ అలరిస్తుంది మెహరీన్. మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి హిట్స్ తర్వాత మెహరీన్‌కి కేరాఫ్ సూర్య, జవాన్, పంతం , నోటా రూపంలో పలు ఫ్లాప్స్ వచ్చాయి. ఇక ఈ అమ్మడు నటించిన ఎఫ్2 చిత్రం మంచి హిట్ కావడంతో మెహరీన్ క్రేజ్ మళ్ళీ పెరిగింది. మెహరీన్ ఇటీవల కళ్యాణ్ రామ్ సరసన ఎంత మంచివాడవురా, ధనుష్ సరసన పటాస్, నాగశౌర్య సరసన అశ్వథ్థామ అనే చిత్రాలు చేసింది. ఇందులో ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుండగా, జనవరి 16న తమిళ చిత్రం పటాస్ రిలీజ్ అవుతుంది. నెల చివరిలో అంటే జనవరి 31న అశ్వథ్థామ చిత్రం విడుదల అవుతుంది. జనవరిలో నెలలో మెహరీన్ నటించిన మూడు సినిమాలు విడుదల అవుతుండగా, ఈ చిత్రాలతో మెహరీన్ హ్యాట్రిక్ కొడుతుందా అనేది చూడాలి.మెహరీన్ .. పులి వాసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బేన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కథానాయకుడిగా నటించనున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఐదవ చిత్రంలో మెహరీన్‌ని కథానాయికగా ఎంపిక చేశారు మేకర్స్. ఇందులో కాజల్ అగర్వాల్ మరో కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ తెరకెక్కించనున్నాడు.
సంక్రాంతి విజయాలు తెస్తుందా?
Related tags :